Friday, 12 February 2021

రష్మిక మందన టాప్ టక్కర్ సాంగ్.. కొత్త అవతారం, క్రేజీ స్టెప్పులతో ఫిదా చేసిన కన్నడ భామ

కన్నడ భామ యమ జోష్‌లో ఉంది. టాలీవుడ్‌లో సత్తా చాటుతూ బాలీవుడ్ అవకాశాలు కూడా చేజిక్కించుకుంటూ మంచి ఫామ్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఓ ఓ వీడియో ఆల్బమ్‌ చేసింది. ‘టాప్ టక్కర్’ పేరుతో ఈ వీడియో ఆల్బమ్ రూపొందించి రిలీజ్ చేశారు. ఈ పాటలో సరికొత్త అవతారంలో కనిపించడమే గాక క్రేజీ స్టెప్పులతో తన అభిమానులను ఫిదా చేస్తోంది రష్మిక. రీసెంట్‌గా ఈ ఆల్బమ్‌కు సంబంధించిన టీజర్‌ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా విడుదలైన ఈ వీడియోలో ఓ వైపు గ్లామర్ ఒలకబోస్తూనే మరోవైపు తనదైన హావభావాలతో ఆకట్టుకుంది రష్మిక మందన. బీ టౌన్ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా అత్యంత కలర్‌ఫుల్‌గా రూపొందించిన ఈ పాటను ఉచానా అమిత్ బాద్‌షా, యువన్ శంకర్ రాజా, జోనితా గాంధీ ఆలపించారు. ఉచానా అమిత్ బాద్‌షానే పాట కూడా రాయడం విశేషం. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా రూపొందుతున్న `మిషన్ మజ్ను` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న రష్మికకు ఈ సాంగ్ బాగా ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఆ మూవీ విడుదలకు ముందే ఇలా బీ టౌన్ ప్రేక్షకులను సైతం బుట్టలో వేసుకుంది ఈ కన్నడ బ్యూటీ. ఇకపోతే టాలీవుడ్‌లో వరుస విజయాలందుకుంటున్న ఈ భామ.. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పల్లెటూరు పిల్లగా అలరించనుందట రష్మిక.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3d6IlDW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...