Friday, 12 February 2021

వాలంటైన్స్ డే నాడు గ్రేట్ న్యూస్ చెప్తానన్న శ్రీముఖి.. హాట్ ఫొటోలతో పిచ్చెక్కించిన యాంకర్

స్టార్ యాంకర్ శ్రీముఖి వాలంటైన్స్ డే నాడు (ఫిబ్రవరి 14న) గ్రేట్ న్యూస్ చెప్పబోతున్నారు. ఈ విషయాన్ని ఆవిడే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని చెప్పడంతో పాటు పేపర్ లాంటి షార్ట్ డ్రెస్‌లో హాట్ ఫొటోలు పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసినవాళ్లు శ్రీముఖి తన పెళ్లి గురించే చెప్పబోతున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘అక్కకు బావ దొరికినట్టున్నాడు’ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం శ్రీముఖి సోషల్ మీడియా హ్యాండిల్స్ పెళ్లి కామెంట్లతో నిండిపోతున్నాయి. అయితే, శ్రీముఖి నిజంగా ఫిబ్రవరి 14న తనకు కాబోయే భర్తను పరిచయం చేయబోతున్నారా అంటే అనుమానమే. ఎందుకంటే, ఈ ప్రకటన తన కొత్త టీవీ షో గురించి అయినా కావచ్చు. కాబట్టి అభిమానులు ముందుగానే ఎగ్జయిట్ కావడం అనవసరం. ఫిబ్రవరి 14 వరకు వేచి చూస్తే మంచిది. కాగా, శ్రీముఖి పోస్ట్ చేసిన ఫొటోలు చూసిన కొంత మంది అభిమానులు ఫీలవుతున్నారు. ‘ఇలాంటి డ్రెస్‌లు వేసుకోకు అక్క’ అని సలహాలు ఇస్తున్నారు. కొంత మంది అయితే హాట్ బ్యూటీ అని కితాబిస్తున్నారు. యాంకర్ అనసూయ సైతం ఫైర్ ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. See Photos: ప్రస్తుతం శ్రీముఖి గోవాలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. బహుశా వాలంటైన్స్ డేను కూడా ఆమె అక్కడే సెలబ్రేట్ చేసుకుంటారేమో. మొత్తం మీద తన అభిమానులు ఫిబ్రవరి 14న ఆమె గ్రేట్ న్యూస్ చెప్పడం పక్కా. బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన దగ్గర నుంచి ఆచితూచి ఆఫర్స్‌ను అంగీకరిస్తున్న శ్రీముఖి.. నాగబాబు ‘బొమ్మ అదిరింది’ షోకి యాంకర్‌గా వ్యవహరించారు. ఈ షో ప్రస్తుతం తాత్కాలికంగా ఆగింది. టీవీ రంగంలో రాణిస్తూనే సినిమాల్లో కూడా అడపాదడపా కనిపిస్తున్నారు శ్రీముఖి. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘క్రేజీ అంకుల్స్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aciIQg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...