బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ''. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం ఇండియన్ వైడ్ ప్రేక్షకలోకం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇందులో అక్కినేని కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఈ సందర్భంగా 'బ్రహ్మాస్త్ర' టీమ్‌తో ప్రయాణంపై స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు నాగార్జున. తన క్యారెక్టర్‌కు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసుకున్నానని తెలుపుతూ ట్వీట్ చేసిన నాగార్జున.. అయాన్ ముఖర్జీ, రణ్‌భీర్ కపూర్, ఆలియా భట్‌లతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు. రణ్‌భీర్ కపూర్, ఆలియా భట్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చిందని, ఇదో అద్భుతమైన అనుభవమని పేర్కొన్నారు. అయాన్ ముఖర్జీ రూపొందించిన అద్భుతమైన ప్రపంచాన్ని చూడాలని చాలా ఆతృతగా ఉందని తెలిపారు. ఈ 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో ఆర్కియాలజిస్టుగా కనిపించనున్నారు నాగార్జున. లాక్‌డౌన్ కంటే ముందే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కొంతమేర షూటింగ్ జరుపుకొని వాయిదా పడింది. రీసెంట్‌గా తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయడంతో నాగార్జున తన డేట్స్ ఇచ్చి తన పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసేశారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో వేసిన భారీ సెట్‌పై ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు. అతిత్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, రిలీజ్ డేట్ ప్రకటించనున్నారట మేకర్స్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u2Tk7y
v
No comments:
Post a Comment