Friday, 19 February 2021

ఛార్మితో విజయ్ దేవరకొండ స్కూటర్ రైడ్.. ఇద్దరూ కలిసి చక్కర్లు కొట్టేస్తూ ఎంజాయ్!! ఫొటోస్ వైరల్

ఛార్మింగ్ బ్యూటీ, సినీ నిర్మాత ఛార్మితో కలిసి స్కూటీపై సరదాగా షికారు కొట్టారు రౌడీ స్టార్ . 'లైగర్' షూటింగ్ స్పాట్‌లో ఇలా ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తూ చిత్రయూనిట్ అందరిలో ఉత్సాహం నింపారు. ఎప్పుడూ యూనిట్ సభ్యులతో సరదాగా గడిపే స్వయంగా డ్రైవ్ చేస్తూ విజయ్ దేవరకొండతో ఓ రౌండ్ వేసేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమెనే స్వయంగా షేర్ చేయడంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండను స్కూటీపై ఎక్కించుకుని షికారు కొట్టిన ఛార్మి ట్విట్టర్ వేదికగా ఈ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ''విజయ్‌ దేవరకొండకు నా మీద ఎంత నమ్మకం ఉందనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ముంబైలో లైగర్ సెట్స్ షూటింగ్ జరుగుతుండగా వచ్చిన గ్యాప్‌లో ఇలా షికార్లు కొట్టాం'' అని పేర్కొంది. వాళ్లిద్దరూ అలా స్కూటీపై వెళ్తుండగా వెనకాల నుంచి పూరి జగన్నాథ్ గమనిస్తుండటం ఈ ఫొటోల్లో చూడొచ్చు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ లైగర్ మూవీ ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా కొన్ని నెలలు షూటింగ్ వాయిదా పడటంతో ఆ గ్యాప్ కవర్ చేసేలా ఇటీవలే షూటింగ్ ప్రారంభించి వేగంగా కంప్లీట్ చేస్తున్నారు పూరి జగన్నాథ్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో రియాలిటీకి దగ్గరగా ఉండేలా విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన విడుదల కాబోతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై విజయ్ దేవరకొండ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pAjjzS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...