Wednesday, 3 February 2021

న్యూడ్ ఫొటో కావాలంటూ పూజా హెగ్డేకు రిక్వెస్ట్.. అడిగింది ఇచ్చి దిమ్మతిరిగే షాకిచ్చిన బుట్టబొమ్మ

దినదినం సోషల్ మీడియా వేగంగా విస్తృతమవుతోంది. హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడం, ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ చేరువ కావడంతో చిన్నాపెద్ద అనే తారతమ్యం లేకుండా సామాజిక మాధ్యమాల్లో అంతా చురుకుగా ఉంటున్నారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా కారణంగా సెలిబ్రిటీలు, సామాన్య మానవులకు మధ్యదూరం చాలావరకు తగ్గిపోయింది. ఎలాంటి విషయాన్నైనా పంచుకుంటే వెసులుబాటు లభించింది. దీంతో కొందరు నెటిజన్స్ దీన్ని మరోలా ఉపయోగిస్తూ సెలబ్రిటీలపై అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పూజా హెగ్డేకు ఇలాంటి అనుభవమే ఎదురుకావడంతో షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది బుట్టబొమ్మ. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు.. తన సోషల్ మీడియా ఖాతా ఇన్స్‌స్టా వేదికగా కాసేపు నెటిజన్లతో టచ్ లోకి వచ్చింది. అంతా బాగానేఉన్నా ఈ లైవ్ చిట్ చాట్‌లో ఓ నెటిజన్ తుంటరి పని చేశాడు. ఏకంగా పూజా హెగ్డేను పెట్టమంటూ రిక్వెస్ట్ చేశాడు. దీంతో వెంటనే చాకచక్యంగా వ్యవహరించిన పూజా.. అతనికి దిమ్మ తిరిగే ఫొటో పోస్ట్ చేసింది. సరైన రీతిలో స్పందించి సదరు నెటిజన్‌కు మైండ్ బ్లాంక్ చేసేసింది. తన మొకాళ్ల వరకు బట్టలు లేకుండా ఫొటో తీసి.. నగ్నంగా ఉన్న నా పాదాల ఫొటో చూడు అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది పూజా. దీంతో, అలా అడిగినా కూడా ఏ మాత్రం కోపగించుకోకుండా అతనికే దిమ్మతిరిగేలా చేసిన తీరును ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. గతేడాది 'అల.. వైకుంఠపురములో' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న పూజా.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయింది. రెబల్ స్టార్ ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్'లో నటిస్తోంది. అలాగే అక్కినేని అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిరల్' చిత్రంలో గ్లామరస్ రోల్ పోషిస్తోంది. మెగా ప్రాజెక్టు 'ఆచార్య'లో కూడా ఆమెకు అవకాశం దక్కిందనేది లేటెస్ట్ టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oM846Q
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...