Saturday, 27 February 2021

అమితాబ్ బచ్చన్‌కు శస్త్ర చికిత్స.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్

బాలీవుడ్ బడా హీరో, బిగ్ బీ మరోసారి సర్జరీ చేయించుకోబోతున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన బ్లాగ్ ద్వారా వెల్లడించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అమితాబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా దీస్తున్నారు. అసలు అమితాబ్‌కు ఏమైందనే ఆలోచనలతో విజయవంతం కావాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు. సర్జరీ జరుగనున్న నేపథ్యంలో తాను బ్లాగ్‌లో సమాచారం ఇవ్వలేకపోయాను అంటూ అమితాబ్ వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. అమితాబ్ ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండకపోవడం వల్ల సర్జరీ చేయాలని ముంబై వైద్యుల బృందం తెలిపినట్లు తెలుస్తోంది. 1982లో 'కూలీ' సినిమా షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుండగా అమితాబ్ గాయపడ్డారు. ఆ సమయంలో శస్త్ర చికిత్స చేయడంతో క్రమంగా కోలుకున్నారు. ఆ తర్వాత 2005 సంవత్సరంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డప్పుడు మరోసారి ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. రీసెంట్‌గా కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు తనకు సర్జరీ జరగనుందని తెలపడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి మూవీ 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించి మెప్పించిన అమితాబ్.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు నాగరాజ్ పోపట్‌రావు మంజులే దర్శకత్వంలో 'జుండ్' అనే మూవీలో నటిస్తున్నారు. 'చహ్రే' అనే మరో సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఆ రెండు సినిమాలు అతిత్వరలో విడుదల కానున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uHbXxY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...