దశాబ్ద కాలంగా స్టార్ హీరోయిన్‌గా సౌత్ ఇండియన్ తెరపై సత్తా చాటుతున్న అగర్వాల్ ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడాక కాజల్‌కి సంబంధించిన రొమాంటిక్ టూర్స్, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు, చిన్నప్పటి సంగతులు చెప్పి మరోసారి వార్తల్లో నిలిచింది కాజల్. తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు బ్రాంకియల్ ఆస్తమా ఉందని తెలిసిందని తెలుపుతూ కాజల్ ఓపెన్ అయింది. ఆ వయసులో ఆహారం విషయంలో తన తల్లిదండ్రులు ఆంక్షలు విధించడం తనకింకా గుర్తుందని పేర్కొంది. శీతాకాలం వచ్చిందంటే చాలు బ్రాంకియల్ ఆస్తమా లక్షణాలు రెట్టింపయ్యేవని, దుమ్ము ధూళిలోకి వెళ్లినా ఆస్తమా లక్షణాలతో ఇబ్బంది పడేదాన్నని చెప్పుకొచ్చింది. అయితే ఇన్‌హెలర్స్ వాడటంతో కాస్త ఉపశమనం పొందేదాన్నని, అందుకే ఎప్పుడూ తన వెంట ఓ ఇన్‌హెలర్ ఉంచుకుంటా అని చెప్పింది. పబ్లిక్‌గా అయినా, ప్రైవేట్‌గా అయినా ఇన్‌హెలర్స్ ఉపయోగించడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదని కాజల్ పేర్కొంది. ఈ విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పిన ఆమె.. 'సే ఎస్ టు ఇన్‌హెలర్స్' అంటూ తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మంచు విష్ణు సరసన 'మోసగాళ్లు', కమల్ హాసన్ సరసన 'భారతీయుడు 2', చిరంజీవి సరసన '' సినిమాలో నటిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tIX5Pw
v
No comments:
Post a Comment