Monday, 8 February 2021

జిమ్‌లో తమన్నా హాట్ వర్కవుట్స్.. ఆ రెండింటినీ లింక్ చేస్తూ మత్తెక్కించిన మిల్కీ బ్యూటీ

నాజూకైన శరీర సౌష్టవంతో గత పదేళ్లుగా సౌత్ ఇండియన్ తెరపై సత్తా చాటుతోంది . ఒకప్పుడు స్టార్ హీరోలకు బెటర్ చాయిస్‌గా వరుస ఆఫర్స్ పట్టేసిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకొని ఇప్పుడు సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే పదేళ్ల క్రింద ఎంత నాజూకుగా ఉందో ఇప్పుడు కూడా అంతే నాజూకుగా ఉండి మిల మిల మెరిసే అందంతో ప్రతి ఒక్కరిచూపును అట్రాక్ట్ చేస్తోంది తమన్నా. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఓ హాట్ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. నిజానికి ఈ ఫోటో జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నప్పటిది అయినా కూడా యమ హాట్‌గా ఉండటంతో నెటిజన్స్ మైమరచిపోతున్నారు. ఈ ఫొటోను తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన మిల్కీబ్యూటీ.. శరీరాకృతిని, మైండ్ సెట్‌ని లింక్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్ పోస్ట్ చేసింది. మన మెదడు చెప్పినట్లు విని కష్టపడితే అందమైన శరీరాకృతి మన సొంతమవుతుందని ఆమె పేర్కొంది. ఇటీవలే కోవిడ్‌కు గురై కోలుకున్న తమన్నా ప్రస్తుతం తన ఫిట్‌నెస్ పైనే పూర్తి శ్రద్ధ పెట్టింది. అందుకు తగ్గట్లుగా జిమ్‌లో తెగ వర్కవుట్లు చేస్తోంది. 'శ్రీ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నా.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'హ్యాపీ డేస్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ పట్టేస్తూ 50కి పైగా సినిమాల్లో నటించింది. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఆమె, ప్రస్తుతం గోపిచంద్ సరసన 'సీటీమార్' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా రాబోతున్న ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’ లో నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aMeGgr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...