Saturday, 6 February 2021

'మెరిసే మెరిసే' టీజర్ రిలీజ్.. డైరెక్టర్‌ శివ నిర్వాణ మెప్పుపొందిన వీడియో

'హుషారు' ఫేమ్ హీరోగా కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మాత వెంకటేష్ కొత్తూరి రూపొందిస్తున్న చిత్రం 'మెరిసే మెరిసే'. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ కుమార్ కె.దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్, కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలతో కూడిన కథను 'మెరిసే మెరిసే' రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ యంగ్‌ డైరెక్టర్‌ శివ నిర్వాణ విడుదల చేశారు. ఒక నిమిషం 7 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లో యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే సన్నివేశాలు చూపించారు. ''గెలుపు, ఓటములు పక్కపక్కనే ఉంటాయి.. కానీ ఎప్పటికీ కలవవు.. వీళ్ళిద్దరిలా'' అంటూ టీజర్‌లో వినిపించిన డైలాగ్ హైలైట్ అవుతోంది. టీజర్‌ని బట్టి చూస్తే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఈ టీజర్ రిలీజ్ చేసిన డైరెక్టర్‌ శివ నిర్వాణ స్పందిస్తూ.. 'మెరిసే మెరిసే' టీజర్‌ చూశాను. చక్కటి విజువల్స్‌తో చాలా కూల్‌గా ఉంది. డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌తో హీరో దినేష్‌ తేజ్‌, హీరోయిన్‌ శ్వేతా అవస్తి తమదైన మార్కుని క్రియేట్‌ చేసుకున్నారు. డైరెక్టర్‌ పవన్‌ కుమార్‌ తొలి చిత్రమే అయినా సినిమాను చక్కగా తెరకెక్కించాడని టీజర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. కచ్చితంగా 'మెరిసే మెరిసే' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను" అన్నారు. ఈ చిత్రానికి కార్తీక్ కొడగండ్ల సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి‌ రెస్పాన్స్‌ వచ్చింది. 'పెళ్లిచూపులు' ఫేమ్ నగేశ్ బానెల్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, శశాంక్, నానాజీ త‌దిత‌రులు నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3txmAmE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...