Thursday, 4 February 2021

సమంతతో నటించే లక్కీ ఛాన్స్ పట్టేసిన అచ్చతెలుగు అందం.. గుణశేఖర్ ప్రతిష్టాత్మక మూవీలో ఈషా రెబ్బ

అచ్చతెలుగు ముద్దుగుమ్మ, టాలీవుడ్ బ్యూటీ మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. వరుస సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నా కెరీర్‌లో మంచి బ్రేక్ కోసం ఆరాటపడుతున్న ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ సమంతతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కిందనేది లేటెస్ట్ టాక్. ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందించనున్న '' సినిమాలో ఈషా రెబ్బకు ముఖ్య పాత్ర ఇవ్వబోతున్నారని సమాచారం. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈషా.. తనదైన నటనతో పలు సినిమాల్లో నటించింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్‌తో కుర్రకారును ఫిదా చేస్తోంది. ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', 'పిట్టకథలు' సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు తాజాగా బిగ్ ఆఫర్ ఇచ్చారట బడా దర్శకుడు గుణశేఖర్. ఆయన దర్శకత్వంలో లీడ్ రోల్‌లో తెరకెక్కించబోతున్న భారీ మూవీ 'శాకుంతలం'లో సమంత నిచ్చెలిగా నటించే ఛాన్స్ ఈషాకు ఇచ్చారట. ఈ రోల్ చిత్రంలో చాలా కీలకం కానుందని తెలుస్తోంది. నిజానికి ఈ పాత్ర కోసం చాలామంది హీరోయిన్స్‌ని పరిశీలించిన గుణశేఖర్.. చివరకు ఈషా రెబ్బాకే ఓటేసి ఫైనల్ చేసేశారట. విభిన్నమైన పౌరాణిక ప్రణయ గాథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటిసారి అక్కినేని కోడలు సమంత పౌరాణిక పాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించనున్నారు. ఇటీవలే అఫీషియల్‌గా ఈ మూవీని ప్రకటించిన గుణశేఖర్ మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో డీలా పడిన ఆయన, ఈ సినిమాతో మరోసారి తన సత్తా బయటపెట్టాలని బలంగా ఫిక్సయ్యారట. సో.. చూడాలి మరి ఈషా రెబ్బాకు ఈ మూవీ ఎలా ప్లస్ అవుతోందో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tlitKt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...