Wednesday, 24 February 2021

గ్రాండ్‌గా సుక్కు కూతురి ఫంక్షన్.. చై, మహేష్ ఫ్యామిలీస్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్ అయిన సమంత

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూతురి ఫంక్షన్‌లో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన సతీమణి నమ్రతతో కలిసి విచ్చేశారు. నాగచైతన్య, సమంత కూడా జంటగా వచ్చి వేడుకలో తెగ సందడి చేశారు. క్లీన్ షేవ్‌తో నాగచైతన్య స్టైలిష్ లుక్‌లో కనిపించగా మోడ్రన్ డ్రెస్‌లో సమంత స్పెషల్ అట్రాక్షన్ అయింది. మహేష్, నమ్రత సింప్లీ సూపర్‌ అన్నట్లుగా ఆకట్టుకున్నారు. వీళ్ళతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ఫంక్షన్‌కి వచ్చారని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుకుమార్ ప్రస్తుతం 'పుష్ప' సినిమాతో బిజీగా ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ నిమిత్తం కేరళ బయల్దేరబోతోంది సుకుమార్ అండ్ టీమ్. 'పుష్ప' సినిమా పూర్తయిన వెంటనే విజయ్ దేవరకొండతో ఓ సినిమాను చేయనున్నారు సుకుమార్. ఇటీవలే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా పిరియాడిక్ జానర్‌లో రూపోందనుందని తెలుస్తోంది. దీంతో పాటు ఓ వెబ్ సిరీస్ కూడా రూపొందించే ప్లాన్ చేస్తున్నారట సుక్కు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/301Aosd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...