Monday, 8 February 2021

‘క్రాక్’ దర్శకుడితో బాలకృష్ణ సినిమా.. ముహూర్తం ఫిక్స్!

నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను మే 28న విడుదల చేయనున్నట్టు నిర్మాత ప్రకటించారు. భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రస్తుతానికి పిలుస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా తరవాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్నారని టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందట. ఈ సినిమా ఓకే అయిపోయినట్టేనని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఉగాది సందర్భంగా ఏప్రిల్ నెలలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో ఉంటుందని కూడా అంటున్నారు. గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమాతో ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మాస్ మహారాజా రవితేజతో హ్యాట్రిక్ కొట్టారు. మరి ఇప్పుడు బాలయ్య కోసం ఆయన ఎలాంటి స్క్రిప్ట్ సిద్ధం చేశారో చూడాలి. ఏదేమైనా గోపీచంద్ మలినేని లాంటి మాస్ డైరెక్టర్‌తో బాలకృష్ణ సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. బోయపాటి, గోపీచంద్ మలినేని లాంటి దర్శకులతో బాలకృష్ణ సినిమాలు చేయడం వల్ల మళ్లీ ఆయనకు పూర్వ వైభవం రావడం ఖాయం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3p1Tatx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...