Friday, 26 February 2021

ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేయబోతున్న ఎన్టీఆర్.. వచ్చే వారమే ప్రోమో!!

పాపులర్ రియాలిటీ గేమ్ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కొత్త సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్టు ఇప్పటికే ఖరారైంది. ‘బిగ్ బాస్’ తొలి సీజన్‌ను హోస్ట్ చేసి శభాష్ అనిపించుకున్న ఎన్టీఆర్.. ఆ షో విపరీతంగా పాపులర్ కావడానికి దోహదపడ్డారు. ఎన్టీఆర్ తొలి సీజన్‌ను మాత్రమే హోస్ట్ చేసినా ఇప్పటికీ ఆయన్నే బెస్ట్ హోస్ట్‌గా అంతా చెబుతుంటారు. అంతలా ఆయన ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అయితే, ఇప్పుడు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ద్వారా బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నారు తారక్. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రచారంలో భాగంగా తాజాగా ప్రోమోను చిత్రీకరించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ ప్రోమో క్రియేటివ్‌గా రూపొందుతోందని సమాచారం. ఈ ప్రోమో వచ్చే వారం అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. ఈ ప్రోమోతో ప్రచార కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వచ్చే నెల నుంచి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ టీవీలో ప్రసారమవుతుందని సమాచారం. ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయిందట. ఈ సీజన్ జెమిని టీవీలో ప్రసారం కానుంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఇప్పటి వరకు నాలుగు సీజన్లు జరిగాయి. 2014 జూన్‌లో తొలి సీజన్‌ నాగార్జున హోస్ట్‌గా ప్రారంభమైంది. అదే ఏడాది డిసెంబర్‌లోనే రెండో సీజన్ కూడా ప్రారంభమైంది. 2015 నవంబర్‌లో మూడో సీజన్‌ను ప్రసారం చేశారు. ఈ మూడు సీజన్లకు అక్కినేని నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2017లో ప్రసారమైన నాలుగో సీజన్‌ను మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు. ఈ నాలుగు సీజన్లు మా టీవీలో ప్రసారమయ్యాయి. అయితే, ఇప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ చేయబోయే ఐదో సీజన్ మాత్రం జెమిని టీవీలో ప్రసారం కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bG0DcR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...