Sunday, 7 February 2021

బ్లాక్ బస్టర్ ‘జాంబి రెడ్డి’.. రెండో రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే!

బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన తేజ సజ్జ (‘ఇంద్ర’ ఫేం) హీరోగా పరిచయమైన చిత్రం ‘జాంబి రెడ్డి’. ఆనంది, దక్ష నగార్కార్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజ్ శేఖర్ వర్మ నిర్మించారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 5న 500 వందలకు పైగా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. విడుదలకు ముందే ‘జాంబి రెడ్డి’కి మంచి ప్రచారం కల్పించడం, తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్‌తో పాటు రెండో రోజు కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.4.63 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంటే, ఈ మొత్తంలో డిస్ట్రిబ్యూటర్ షేర్ విలువ రూ.2 కోట్ల పైనే ఉంటుంది. ‘జాంబి రెడ్డి’ తొలి రోజు రూ.2.26 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీనిలో రూ.1.03 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ఉంటుంది. తొలి వారం (మూడు రోజులు) ముగిసే సరికి సుమారు రూ.3 కోట్ల షేర్‌ను ఈ చిత్రం వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఆ అంచనాలను ‘జాంబి రెడ్డి’ అందుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు రోజుల్లో రూ.2 కోట్ల పైనే షేర్‌ను ఈ చిత్రం రాబట్టింది. సాధారణంగా ఆదివారం కలెక్షన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి మరో కోటి రూపాయలు వసూలు చేయడం ఖాయం. జాంబి జోనర్‌లో కామెడి ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘జాంబి రెడ్డి’లో రఘుబాబు, పృథ్వీరాజ్, గెటప్ శీను, హర్షవర్ధన్, హేమంత్, కిరీటి, హరితేజ, అదుర్స్ రఘు, మహేష్ విట్ట, అన్నపూర్ణమ్మ, విజయ్ రంగరాజు, వినయ్ వర్మ, నాగ మహేష్, ప్రియ, చరణ్ దీప్, త్రిపురనేని చిట్టి నటించారు. మార్క్ కె.రాబిన్ సంగీతం సమకూర్చారు. అనిత్ మాదాడి సినిమాటోగ్రఫీ అందించారు. సాయిబాబు తలారి ఎడిటర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pYGqFg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...