Sunday, 21 February 2021

అదే జరిగితే నేనెందుకు వద్దంటా? మనసులో మాట బయటపెట్టిన రష్మిక.. నా కల అదేనంటూ ఓపెన్

కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన కన్నడ భామ .. 'ఛలో' అంటూ టాలీవుడ్ గడపతొక్కి అనతికాలంలోనే బిజీ హీరోయిన్‌గా మారింది. విజయ్ దేవరకొండ సరసన నటించిన 'గీత గోవిందం' సినిమా ఆమె కెరీర్‌ని టర్న్ చేసింది. దీంతో తెలుగు సినిమా దర్శకనిర్మాతలు రష్మిక డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో రష్మిక రేటు పెంచేసిందని, అమ్మడికి అప్పుడే అంత డిమాండా? అనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం లోకి వచ్చాయి. తాజాగా ఈ విషయమై రియాక్ట్ అయింది రష్మిక. ఓ బాలీవుడ్ మూవీ కోసం రష్మిక మందన ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్మ్యూనరేషన్ తీసుకుందని వార్తలు షికారు చేస్తుండటంతో దీనిపై క్రేజీగా స్పందించింది ఈ ముద్దుగుమ్మ. ''నేను భారీ రెమ్మ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అవే నిజమైతే ఎంత బాగుండో! అయినా వాళ్ళిస్తే నేనెందుకు వద్దంటా?'' అనేసింది రష్మిక. అంతటితో ఆగక తన మనసులోని మాట కూడా బయటపెట్టేసింది. మీరంతా అనుకున్నంత ఆ రెమ్యూనరేషన్ తీసుకోవాలనేదే నా కల అని ఆమె పేర్కొంది. దీంతో రష్మిక వెండితెరపైనే కాదు, మాటల్లోనూ క్రేజీనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది రష్మిక. సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆమె రోల్ మునుపెన్నడూ చుడనివిధంగా, మరింత క్రేజీగా ఉంటుందట. దీంతోపాటు శర్వానంద్ హీరోగా రాబోతున్న ‘ఆడాళ్లు మీకు జోహార్లు ’ అనే సినిమాలో ఆమె భాగమవుతోంది. వీటితో పాటు మరో రెండు బాలీవుడ్ సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bkB8ha
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...