Thursday, 25 February 2021

అందుకోసమే ప్రత్యేకంగా ముంబైలో ఫ్లాట్! ఎక్కడా తగ్గని రష్మిక.. అమ్మడి రేంజ్ మామూలుగా లేదే!!

కలిసొచ్చే కాలం రావాలే గానీ ఆపడం ఏ ఒక్కరి తరం కాదనేది పెద్దలమాట. ప్రస్తుతం యంగ్ హీరోయిన్ స్పీడు చూస్తుంటే అదే ఫార్ములా ఈ అమ్మడికి అప్లై అవుతోందనిపిస్తోంది. కన్నడ సినిమా కిర్రిక్ పార్టీతో సినీ గడప తొక్కిన ఈ బ్యూటీ.. 'ఛలో' అంటూ టాలీవుడ్ గడపతొక్కి తెలుగు ప్రేక్షకుల క్రీజీ హీరోయిన్ అయింది. వరుస ఆఫర్స్‌తో బిజీ అయిపోయింది. ఇక రీసెంట్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసిన ఆమె.. ఏకంగా ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనేసిందని సమాచారం. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప' సినిమాలో నటిస్తున్న రష్మిక మందన.. బాలీవుడ్‌లో సిద్ధార్థ మల్హోత్రా సరసన 'మిషన్ మజ్ను' సినిమాలో నటించే ఛాన్స్ పట్టేసింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఆ వెంటనే బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకమైన బ్యానర్‌లో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో డాడీ అనే చిత్రంలో నటించడానికి కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మరికొన్ని బాలీవుడ్ కథలను వింటోందట ఈ కన్నడ భామ. ఈ నేపథ్యంలో షూటింగ్స్ నిమిత్తం ముంబై వెళ్లడం, అక్కడి హోటల్స్‌లో ఉండటం ఎందుకని భావించి ఏకంగా ఓ ముంబైలో ఫ్లాట్ కొనేసిందట రష్మిక. ఈ ఫ్లాట్ ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఉందని, ఇందుకోసం అమ్మడు కోట్లలో వెచ్చించిందని వార్తలు వస్తున్నాయి. సముద్ర తీరానికి దగ్గరలో సీ ఫేసింగ్ అపార్ట్‌మెంట్‌లో ఆమె ఇల్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవలే రష్మిక.. ఖరీదైన, ట్రెండీ స్పోర్ట్స్ కారును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తన కారుతో దిగిన ఫోటో షేర్ చేస్తూ తనపై అభిమానులు కురిపిస్తున్న ప్రేమ, సపోర్టుకు ధన్యవాదాలు అని ఆమె తెలిపింది. దీంతో అత్యంత తక్కువకాలంలో రష్మిక.. ఈ రేంజ్‌కి ఎదగడం జనాల్లో హాట్ టాపిక్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2O375lZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...