Wednesday, 17 February 2021

పవన్ కళ్యాణ్- క్రిష్ మూవీ మూవీ అప్‌డేట్.. బాలీవుడ్ యాక్టర్ అర్జున్‌ రాంపాల్‌ రోల్ ఇదే!!

గత రెండుళ్లుగా రాజకీయాల్లో బిజీ అయిన .. నిర్మాతలు, అభిమానుల కోరిక మేరకు తిరిగి కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే 'వకీల్ సాబ్' షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన, ఏ మాత్రం విరామం తీసుకోకుండా తన తదుపరి సినిమా షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు. ఓ వైపు ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్‌‌లో నటిస్తూనే, మరోవైపు డైరెక్టర్ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు పవన్. బిజీ షెడ్యూల్‌లో కూడా డేట్స్ ఇవ్వడంతో డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా షూటింగ్ వేగాన్ని పెంచేశారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో బాలీవుడ్‌ నటుడు ఆరో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించనుండటం విశేషం. ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించిన 12 రోజుల పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరణ చేయబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా చార్మినార్‌, మచిలీపట్నం పోర్ట్ సెట్లను వేశారు. ఇందులో పవన్ కళ్యాణ్- అర్జున్‌ రాంపాల్‌లపై కొన్ని సీన్స్ షూట్ చేయనున్నారట. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అర్జున్‌ రాంపాల్ సోదరి పాత్రలో బాలీవుడ్‌ భామ జాక్విలీన్‌‌ ఫెర్నాండజ్ కనిపించనుందట. ఈ ఏడాది మే నెల వరకు షూటింగ్‌ మొత్తం పూర్తి చేసేలా పవన్ కళ్యాణ్- క్రిష్ ప్లాన్ చేసుకున్నట్లు టాక్. ఇకపోతే మొదట ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్ పెట్టారని వార్తలు వచ్చినప్పటికీ, రీసెంట్‌గా ‘హరి హర వీరమల్లు’ అనే టైటిల్ ఫిక్సయ్యారని తెలిసింది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3k67znt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...