Saturday, 20 February 2021

నా బలం ఈ ఇద్దరేనంటూ రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్.. తల్లిదండ్రులకు చెర్రీ బెస్ట్ విషెస్

ఏ బిడ్డకైనా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మించిన ఆస్తి, అంతస్తు ఈ సృష్టిలో ఎంత వెతికినా దొరకదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బిడ్డ వెన్నంటి ఉంటూ సక్రమమైన మార్గంలో నడిపించేది, బిడ్డ ప్రతి విజయంలోనూ కీలకపాత్ర పోషించేది తల్లిదండ్రులే. ఇదే విషయాన్ని మెసేజ్ రూపంలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ కామెంట్ పెట్టారు మెగా పవర్ స్టార్ . ఈ మేరకు తన తల్లి దండ్రులైన చిరంజీవి- సురేఖ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ వారి ఫొటో షేర్ చేశారు. నేడు (ఫిబ్రవరి 20) మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతుల పెళ్లి రోజు. 1980 సంవత్సరం సరిగ్గా ఇదే రోజున వివాహ బంధంతో ఒక్కటయ్యారు చిరంజీవి- సురేఖ. వారి వివాహం జరిగి నేటితో 42 ఏళ్ళు పూర్తయింది. ఈ సంద‌ర్బంగా మెగా దంప‌తుల‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ ప్ర‌ముఖులు , స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు పెద్దఎత్తున శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చిరు దంపతుల పిక్ షేర్ చేసిన రామ్ చరణ్.. 'నా పూర్తి బలం మీరే' అంటూ వారిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. చెర్రీ చేసిన ఈ ట్వీట్ చూసి దంపతులకు మ్యారేజ్ డే విషెస్ పెడుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కెరీర్ పరంగా చూస్తే చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు చిరంజీవి. కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా కీలకపాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ షూటింగ్ పూర్తికాగానే `లూసిఫర్` రీమేక్‌ సెట్స్ మీదకు రానున్నారు చిరు. మరోవైపు RRR షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు రామ్ చరణ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aCcZmZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...