Sunday, 14 February 2021

శ్రీ రెడ్డి క్లైమాక్స్: రాజేంద్రప్రసాద్‌తో ఆమె! జనాలందరూ జుట్టు పీక్కోవాలన్న నటకిరీటి

టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలపై విరుచుకుపడుతూ సంచలన తారగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఇక వెండితెరపై తన ప్రతాపం చూపించేందుకు రెడీ అయింది. ఆమె ముఖ్యపాత్రలో 'క్లైమాక్స్' మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం 56 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్‌లో నటకిరీటి రాజేంద్రప్రసాద్ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. విజయ్ మోడీ అనే పాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపిస్తున్నారు. ఆయన రోల్ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను పోలి ఉండటం, అతనికి అమ్మాయిల వీక్నెస్ ఉండటం చూస్తుంటే ఈ రోల్ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. 'జనాలందరూ ఎవడ్రావీడు వీడు అంటూ జుట్టుపీక్కోవాలి' అని ఆయన చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక మధ్యలో శ్రీ రెడ్డి ఎంటర్ కావడం, ఆమెతో పాటు పృథ్వీరాజ్, శివశంకర్ మాస్టర్ కనిపించడం సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది. తన లైఫ్‌కు దగ్గరగా ఉండేలా ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఉంటుందని, క్యారెక్ట‌ర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని ఇదివరకే శ్రీ రెడ్డి చెప్పింది. `డ్రీమ్‌` చిత్రంతో ఏడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు ద‌క్కించుకున్న భ‌వానీ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పి.రాజేశ్వర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. రాజేంద్రప్రసాద్‌ డిఫరెంట్ రోల్ పోషించడంతో పాటు ఆయన సినిమాలో శ్రీ రెడ్డి భాగం కావడంతో అందరి కళ్ళు ఈ సినిమాపై పడ్డాయి. సో.. చూడాలి మరి ఈ క్లైమాక్స్‌తో ఎలాంటి సందేశం ఇస్తారనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LUKO9y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...