Tuesday, 9 February 2021

‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ బిజినెస్: వైష్ణవ్ తేజ్‌కు భారీ టార్గెట్.. తొలి వారం కీలకం

చిరంజీవి చిన్న మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న ‘’ సినిమా ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడులవుతోంది. వైష్ణవ్ తేజ్‌కు ఇది తొలి సినిమానే అయినా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం అద్భుతంగా జరిగింది. డిస్ట్రిబ్యూటర్ల నుంచి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మంచి డీల్స్ అందుకుందని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ‘ఉప్పెన’ థియేట్రికల్ రైట్స్‌ను రూ.20.50 కోట్లకు విక్రయించారని తెలిసింది. ‘ఉప్పెన’ నైజాం థియేట్రికల్ రైట్స్‌ను రూ.6 కోట్లకు విక్రయించిన మైత్రీ మూవీ మేకర్స్.. ఆంధ్ర థియేట్రికల్ రైట్స్‌ను రూ.10 కోట్లకు, సీడెడ్ రూ.3 కోట్లకు విక్రయించిందట. ఓవర్సీస్, మిగిలిన ప్రాంతాలు కలుపుకుని రూ.1.5 కోట్లని అంటున్నారు. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ‘ఉప్పెన’ థియేట్రికల్ రైట్స్ రూ.20.5 కోట్లకు అమ్ముడుపోయాయి. దీన్ని బట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటడానికి సుమారు రూ.22 కోట్ల షేర్ వసూలు చేయాలి. అంటే, వైష్ణవ్ తేజ్‌కు తొలి సినిమాతోనే భారీ టార్గెట్ పెట్టారు. ఒక డెబ్యూ హీరో సినిమాకు జరిగిన అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్‌లలో ‘ఉప్పెన’ సినిమా కూడా చేరింది. అయితే, ‘ఉప్పెన’ ఓపెనింగ్స్ అదిరిపోతాయని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. తొలిరోజు సుమారు రూ.7 కోట్లు వసూలవుతుందని అంటున్నారు. తొలి వారం ముగిసే సరికి వీలైనంత ఎక్కువ వసూలు చేసేయాలని డిస్ట్రిబ్యూటర్లు చూస్తున్నారు. అందుకే, తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలను కూడా పెంచారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టిక్కెట్ ధరలను రూ.150 చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ఏరియాల్లో రూ.200కు కూడా పెంచారు. ఇక మల్టీప్లెక్సుల్లోనూ టిక్కెట్ ధరలు రూ.200కు పెరిగాయి. బుక్ మై షో యాప్‌లో ఇప్పటికే ‘ఉప్పెన’ అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈనెల 12 భారీ ఎత్తున విడుదలవుతోన్న ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. వైష్ణవ్ తేజ్ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటించారు. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Z0zTOq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...