Saturday, 27 February 2021

ముదిరిన శృతి హాసన్ డేటింగ్ వ్యవహారం.. కొత్త బాయ్ ఫ్రెండ్‌తో చిల్లింగ్.. తండ్రితో ఇద్దరి మీట్

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కొద్ది రోజులపాటు సినిమాలు కూడా పక్కన పెట్టేసి తన మాజీ ప్రియుడు, ఇంగ్లండ్ సింగర్ మైకేల్ కోర్స‌లేతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో ఆయన్ను ఇండియాకు తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు కూడా పరిచయం చేసింది. దీంతో ఈ ఇద్దరి పెళ్లి కన్ఫర్మ్ అని అంతా ఫిక్సయ్యాక.. మెల్లగా అతనితో కట్ చేసుకుంది శృతి. కారణాలేంటనేవి బయటకురానప్పటికీ వారి ప్రేమ బంధానికి మాత్రం ఫుల్‌స్టాప్ పడింది. ఆ తర్వాత తిరిగి సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చిన శృతి.. కొద్ది రోజులుగా మరో వ్యక్తితో ప్రేమాయణం నడుపుతోందని, డేటింగ్ వ్యవహారం ముదిరిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ వార్తలకు బలం చేకూరుస్తూ తన కొత్త బాయ్ ఫ్రెండ్ శంతను హజారికా‌ను తండ్రి కమల్ హాసన్‌కి పరిచయం చేసింది . ముంబైకి చెందిన ఆర్టిస్టు శంతను హజారికాతో కలిసి చెన్నైలో ఆమె చేసిన హంగామా, తండ్రి కమల్ హాసన్‌కి పరిచయం చేయడం చూస్తుంటే ఈ ఇద్దరి లవ్ ఎఫైర్ ఎక్కడిదాకా వెళ్లిందో అర్థమవుతోంది. రాజకీయ పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉన్న కమల్ హాసన్‌కు శంతను హజారికా ఓ అపురూపమైన గిఫ్ట్ ఇవ్వడం గమనార్హం. తమిళ రాజకీయ ప్రక్షాళనకై బయల్దేరిన కమల్..‌ ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో టార్చ్ లైట్‌ పట్టుకొని అలా నడుచుకుంటూ వస్తున్నట్లు తానే స్వయంగా గీసిన ఆర్ట్‌ను ప్రెజెంట్ చేశారు శృతి బాయ్ ఫ్రెండ్ శంతను. ఈ ఆర్ట్ వర్క్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఆయన్ను ప్రశంసించారు కమల్. ఇకపోతే చెన్నైలో తన ప్రియుడు శంతను హజారికాతో కలిసి హంగామా చేసిన శృతి.. అతన్ని కౌగిలించుకొని సన్నిహితంగా దిగిన ఫొటోలను తన సోషల్ మీడియా వాల్‌పై పోస్ట్ చేసింది. పైగా 'చెన్నైలో చిల్లింగ్ సీన్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో శృతి ప్రేమ వ్యవహారం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dPORiZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...