Sunday, 21 February 2021

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కరీనా కపూర్.. రెండో బిడ్డకు తల్లైన సీనియర్ హీరోయిన్

కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ దంపతులకు రెండో బిడ్డ జన్మించింది. నేడు (ఆదివారం) ఉదయం కరీనా మగబిడ్డకు జన్మినిచ్చినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. , కరీనా కపూర్‌లకు మొదటి సంతానంగా 2016లో తైమూర్ అలీ ఖాన్ జన్మించాడు. తాజాగా ఆమె మరో బిడ్డకు జన్మనివ్వడంతో చిన్నారికి వెల్‌కమ్ చెబుతూ పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గత కొన్ని రోజులుగా తన బేబీ బంప్‌తో యోగాసనాలు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు కరీనా. ఈ క్రమంలో తాజాగా ఆమెకు పండంటి బిడ్డ జన్మించిందనే విషయం తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్‌ని ప్రేమించి పెళ్లాడారు కరీనా. 2012 సంవత్సరంలో వీరి వివాహం జరిగింది. అంతకుముందే అమృతా సింగ్‌‌ని పెళ్లాడిన సైఫ్ వ్యక్తిగత కారణాలతో విడిపోయి తర్వాత కారీనాను పెళ్లాడారు. ఇకపోతే ప్రస్తుతం 'లాల్ సింగ్ చద్దా' చిత్రంలో నటిస్తున్నారు కరీనా. ఈ సినిమాలో అమీర్ ఖాన్‌ హీరోగా నటిస్తున్నారు. అలాగే కరణ్ జోహర్ రూపొందిస్తున్న తఖ్త్ చిత్రంలో కూడా ఆమె కనిపించనున్నారు. మరోవైపు కెరీర్ పరంగా బిజీగా ఉన్న సైఫ్ అలీఖాన్.. ప్రభాస్‌ భారీ సినిమా 'ఆదిపురుష్'లో కీలక పాత్ర పోషిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37yA3RA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...