Tuesday, 2 February 2021

విశ్వక్‌‌సేన్ ‘పాగ‌ల్’ రొమాంటిక్ ఫ‌స్ట్‌లుక్.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మాస్ క దాస్

టాలెంటెడ్ యంగ్ హీరో కిందటేడాది ‘హిట్’ చిత్రంతో మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను సాధించిన విష‌యం తెలిసిందే. గతేడాది ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌తో వచ్చిన విశ్వక్‌సేన్.. ఈ ఏడాది మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఆ చిత్రమే ‘పాగల్’. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు స‌మ‌ర్పణ‌లో లక్కీ మీడియా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై బెక్కం వేణు గోపాల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. మంగళవారం ‘పాగ‌ల్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫ‌స్ట్‌ లుక్ పోస్టర్‌తో పాటు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల‌చేస్తున్నట్లు అధికారికంగా ప్రక‌టించారు. ఈ పోస్టర్‌లో విశ్వక్‌సేన్ ఉబర్ కూల్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో గులాబీ పూలు ప్రేమ‌ను, స్వచ్ఛత‌ను సూచిస్తున్నాయి. ర‌ధ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ఎస్.మణికంద‌న్‌ సినిమాటోగ్రఫీ, గ్యారీ బీహెచ్‌ ఎడిటింగ్ అందిస్తున్నారు. నరేష్ కుప్పిలి ఈ సినిమాకు దర్శకత్వం అందించడంతో పాటు కథ, కథనం కూడా ఆయనే రాసుకున్నారు. రామ‌జోగ‌య్య శాస్త్రి, కెకె, కిట్టు విస్సాప్రగ‌డ‌ సాహిత్యం అందించారు. దిలీప్‌ సుబ్బరాయ‌న్‌, రామ‌కృష్ణ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. విజయ్ ప్రకాష్ కొరియోగ్రాఫర్. లత తరుణ్ ప్రొడక్షన్ డిజైనర్, వెంకట్ మద్దిరాల చీఫ్ కో డైరెక్టర్, అనిల్ భాను పబ్లిసిటీ డిజైనర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rc4kNC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...