Friday, 19 February 2021

ప్రేమ గుట్టువిప్పిన శ్రీముఖి.. సుమ ముందే ఓపెన్! లిమిట్స్ క్రాస్ చేయొద్దంటూ అతనికి వార్నింగ్

కరోనా, ఆ కారణంగా విధించిన లాక్‌డౌన్ సంగతేమో గానీ.. గత కొన్ని నెలలుగా సెలబ్రిటీల పెళ్లి బాజాలు, ప్రేమ సంగతులు మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. వరుసపెట్టి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ పెళ్లి పీటలెక్కుతున్నారు. దీంతో ఆ లిస్టులో ఉన్న ఇంకొందరు సెలబ్రిటీలపై అందరి కన్ను పడింది. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు . బుల్లితెర హాట్ యాంకర్‌గా రాణిస్తున్న ఈ అమ్మడి పెళ్లి మ్యాటర్ గత కొద్దిరోజులుగా చర్చల్లో నిలుస్తోంది. ఈ పరిస్థితుల్లో తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెబుతూ యాంకర్ ముందే ఓపెన్ అయింది శ్రీముఖి. స్టార్ మాలో 'స్టార్ట్ మ్యూజిక్' అనే కొత్త షో ప్రసారమవుతోంది. ఈ షోకి బుల్లితెర మాటల మహారాణి సుమ హోస్ట్‌గా చేస్తోంది. ఈ ఆదివారం ప్రసారం కాబోతున్న ఈ షో ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. శ్రీముఖి, విష్ణు ప్రియ, హరి, పండు మాస్టర్, ఆర్జే చైతూ, రోల్ రైడాలు ఈ షోకి అటెండ్ అయ్యారు. ఇందులో సుమ- శ్రీముఖి మధ్య జరిగిన సంభాషణ, శ్రీముఖి బాయ్ ఫ్రెండ్ వ్యవహారం హైలైట్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్నవారిలో ఏ హీరో అంటే ఇష్టమంటూ శ్రీముఖిని ఇరికించే ప్రయత్నం చేసింది సుమ. అయితే తనకు చిరంజీవి అంటేనే ఇష్టమంటూ ఓపెన్‌గా చెప్పేసింది శ్రీముఖి. ఇక ఆ వెంటనే.. ఒకవేళ రొమాంటిక్ డేట్‌కి వెళ్లాల్సి వస్తే ఎవరితో వెళ్తావని సుమ మరో ప్రశ్న వేయడంతో శ్రీముఖి అసలు విషయం బయటపెట్టింది. ''ఆల్రెడీ కమిటెడ్.. ఇప్పుడు నేనిలా డేటింగ్‌ వెళ్తే నా బాయ్ ఫ్రెండ్ ఫీలవుతాడు. నాకంటూ కొన్ని నియమాలున్నాయి'' అంటూ అందరిముందే బాంబ్ పేల్చింది శ్రీముఖి. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఇకపోతే 'పండు కొంచెం లిమిట్స్‌లో ఉండు నువ్వు' అంటూ శ్రీముఖి ఇచ్చిన వార్నింగ్, 'అన్నిచోట్లకు వెళ్లి నువ్వు పండక్కర్లే' అని సుమ వేసిన పంచ్ ఈ షోపై ఆసక్తిని పెంచుతున్నాయి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సో.. మరి ఫుల్ ఎపిసోడ్‌ వస్తే గానీ చెప్పలేం తన బాయ్ ఫ్రెండ్ గురించి శ్రీముఖి అన్నీ చెప్పిందా? లేదా అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZtqWgX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...