Wednesday, 10 February 2021

షర్మిల కొత్త పార్టీపై పవన్ కళ్యాణ్ ఫస్ట్ రియాక్షన్.. అది ఆమె హక్కు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో రాజన్న రాజ్యం అంటూ కొత్త పార్టీ నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. గత కొంతకాలంగా జగనన్న వదిలిన బాణం కొత్త పార్టీ పెట్టబోతుందంటూ ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు ఈ బాణం ఏపీ నుంచి తెలంగాణకు దూసుకువచ్చింది. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన షర్మిల.. త్వరలో పార్టీని ప్రకటించబోతున్నారు. ఈ తరుణంలో షర్మిల కొత్త పార్టీని స్వాగతించే వాళ్లు కొందరైతే.. ఈమె ఎవరు వదిలిన బాణం అంటూ చర్చోపచర్చలు మొదలయ్యాయి. ఈ తరుణంలో జనసేన అధినేత, పవర్ స్టార్ స్పందిస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పవన్ కళ్యాణ్.. కేంద్ర పెద్దలతో వరుస భేటీలు అవుతున్నారు. దేవాలయాలపై దాడులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంపై బీజేపీ పెద్దలతో ప్రస్తావించినట్టు తెలిపారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా షర్మిల కొత్త పార్టీపై పవన్ కళ్యాణ్ స్పందనను విలేకరులు కోరగా.. ‘ఆమె పార్టీ ఇంకా ఫామ్ చేయలేదు కదా.. చేయబోతున్నారు.. పార్టీని స్థాపించి వారి విధివిధాలను తెలియజేసినప్పుడు.. వారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి వచ్చే హక్కు, అవకాశం ఉంది.. ఎవరైనా రావచ్చు. పార్టీ పెట్టొచ్చు.. ఎవరైనా రావాలనే కోరుకుంటాం.. అందులో తప్పేం లేదు’ అంటూ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు పవర్ స్టార్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3d0SQZE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...