Wednesday, 3 February 2021

యాదాద్రి ఆలయానికి రూ.25 లక్షల బంగారాన్ని అందజేసిన ప్రముఖ నిర్మాత

టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తూ, పాన్ ఇండియా సినిమాలను తెలుగులో విడుదల చేస్తూ విజయవంతమైన ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి.. లక్ష్మీనరసింహ స్వామి వారికి భారీ విరాళం అందజేశారు. నరసింహ స్వామి వారికి బంగారు కవచం నిమిత్తం రూ.25 లక్షలు విలువ చేసే బంగారాన్ని సాయి కొర్రపాటి సమర్పించారు. ఈ బంగారాన్ని బుధవారం ఈఓ గీతా రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ పాల్గొన్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమాతో వారాహి చలనచిత్రం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. సురేష్ ప్రొడక్షన్స్, మకుట వీఎఫ్ఎక్స్ సంస్థలతో కలిసి ‘ఈగ’ సినిమాను నిర్మించి తొలి ప్రయత్నంలోనే విజయవంతమైంది. ఆ వెంటనే ‘అందాల రాక్షసి’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఒక్క ఏడాదిలో మూడు నాలుగు సినిమాలు నిర్మించి వాహ్ అనిపించుకుంది. ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘రాజుగారి గది’, ‘రాజా చెయ్యి వేస్తే’, ‘మనమంతా’, ‘జ్యో అచ్యుతానంద’, ‘పటేల్ సర్’, ‘యుద్ధం శరణం’, ‘విజేత’.. ఇలా నాన్‌స్టాప్‌గా సినిమాలు నిర్మించింది వారాహి చలనచిత్రం. సినిమాలను నిర్మించడమే కాకుండా కన్నడ బ్లాక్ బస్టర్ ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’ను తెలుగులో విడుదల చేసింది. 2018లో విడుదలైన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 2019లో మరో కన్నడ పాన్ ఇండియా మూవీ ‘పహిల్వాన్’ను తెలుగులో విడుదల చేసింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను కూడా వారాహి చలనచిత్రమే దక్కించుకుంది. అలాగే, యం.యం.కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహా హీరోగా ‘తెల్లవారితే గురువారం’ సినిమాను నిర్మిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cIXJGF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...