Sunday, 3 January 2021

RRR తర్వాత రామ్ చరణ్ మూవీ ఆ డైరెక్టర్ తోనే..! స్టోరీ లైన్ చెప్పానంటూ హింటిచ్చిన యువ దర్శకుడు

మెగా పవర్ స్టార్ ప్రస్తుతం తన సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ కనిపించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా పలు భాషల్లో రూపొందుతున్న ఈ మూవీ దాదాపు 80 శాతం షూటింగ్ ఫినిష్ చేసుకుంది. దీంతో చెర్రీ తదుపరి ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్‌తో ఉంటుందనే విషయమై చాలా రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ యువ దర్శకుడు రామ్ చరణ్‌కి స్టోరీ లైన్ చెప్పానంటూ చిన్న హింట్ ఇచ్చాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా రాణిస్తూ మెగా అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నారు రామ్ చరణ్. ఈ క్రమంలోనే ఇటీవలే ‘లూసిఫర్’ రీమేక్ హక్కులు తీసుకున్న ఆయన తండ్రి చిరంజీవితో ఈ మూవీ రూపొందించబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఓ 30 నిమిషాల కీలక పాత్ర కూడా పోషించనున్నారు.‌ RRR మూవీ చేస్తూనే ఈ రోల్ కూడా కంప్లీట్ చేసి తన తదుపరి ప్రాజెక్ట్‌లో రామ్ చరణ్ ఎంటరవుతారని టాక్. కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమిళ దర్శకుడు చెర్రీకి సింపుల్‌గా ఓ లైన్‌ చెప్పానని, తాను ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘విక్రమ్‌’ సినిమాతో బిజీగా ఉన్నా కాబట్టి ఆ సినిమా పూర్తయ్యాక చరణ్‌కు పూర్తి కథ చెబుతానని అన్నారు. దీంతో ఈ ఇద్దరి కాంబో దాదాపుగా సెట్టయిపోయినట్లే అనే టాక్ ముదిరింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. సో.. చూడాలి మరి చెర్రీ టీమ్ దీనిపై ఎలా స్పందిస్తుందనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rQkj5a
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...