Saturday, 9 January 2021

Rashmi: సుధీర్‌తో మ్యారేజ్ విషయమై యాంకర్ రష్మీ కామెంట్స్.. నా ప్లాన్ ఇదేనంటూ ఓపెన్ అయ్యిందిలా!

రష్మీ గౌతమ్- సుడిగాలి సుధీర్.. ఈ జోడీ గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. జబర్దస్త్ వేదికపై కలిసిన ఈ జంట బుల్లితెర పాపులర్ జోడీగా తెగ హంగామా చేస్తోంది. ఏ పండగ వచ్చినా, ఏ ఈవెంట్ జరిగినా ఈ ఇద్దరిపై షూట్ చేసిన సాంగ్స్, ఫన్నీ సన్నవేషాలు వైరల్ అవుతుంటాయి. దీంతో యూత్‌లో సూపర్ ఫాలోయింగ్‌ కూడగట్టుకుంది రష్మీ- సుధీర్ జంట. ఇక వీళ్ళ మధ్య ఎఫైర్, పెళ్లికి సంబంధించిన విషయాలైతే నిత్యం సోషల్ మీడియాలో ఎక్కడోచోట తారసపడుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా సుధీర్‌తో మ్యారేజ్ విషయమై యాంకర్ రష్మీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇటు సుధీర్‌కి రష్మీ కారణంగా అటు రష్మీకి సుధీర్ కారణంగా భారీ క్రేజ్ దక్కింది. బుల్లితెరపై ప్రసారమయ్యే వీళ్లిద్దరి రిలేషన్ మీద ఓ రేంజ్ జోకులేస్తూ జబర్దస్త్‌ వినోదం పంచుకుతుంటారు. యూట్యూబ్‌లో అయితే రష్మీ- సుధీర్ రిలేషన్‌పై పుట్టలుపుట్టలుగా వీడియోలు చేశారు. కొందరైతే ఏకంగా రష్మీ- సుధీర్ సీక్రెట్‌గా పెళ్లి కూడా చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి తప్పుడు ప్రచారాలను నొమ్మోదంటూ చాలా సార్లు ఈ విషయమై స్పందించిన రష్మీ.. తాజాగా కాస్త ఆసక్తికరంగా మాట్లాడటంతో ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఏదైనా ఈవెంట్‌లో గానీ, ఇంటర్వ్యూలో గానీ సుడిగాలి సుధీర్, రష్మీ కనిపిస్తే చాలు ముందు వారి రిలేషన్, పెళ్లి గురించిన ప్రశ్నలే ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ రష్మీ ఓ కార్యక్రమానికి హాజరుకాగా ఎప్పటిలాగే సుధీర్‌తో పెళ్లి గురించి అడిగేశారు. దీనిపై రియాక్ట్ అయిన రష్మీ.. 'మా ఇద్దరి పెళ్లి జరగాలని జనాలు కోరుకుంటున్నారని నాకూ తెలుసు కానీ ప్రస్తుతం నా ఆలోచనలు, ప్లాన్స్ అన్నీ కెరీర్‌పై మాత్రమే ఉన్నాయి' అని చెప్పింది రష్మీ. అలాగే ఇదే ఇంటర్వ్యూలో మీ ఇద్ద‌రిది హిట్ పెయిర్ క‌దా.. మీ ఇద్ద‌రి కాంబోలో సినిమాను చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వారి కోరిక ఈ ఏడాదైనా తీరేనా? అని ర‌ష్మిని ప్ర‌శ్నించ‌గా.. అన్నీ కుదిరితే జ‌ర‌గొచ్చు అని ఆమె తెలిపారు. నేను, సుధీర్ కూడా స్క్రిప్ట్‌లు వింటున్నాము. స్క్రిప్ట్ న‌చ్చితే క‌చ్చితంగా న‌టిస్తాము అని ర‌ష్మి చెప్పుకొచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nx2XH0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...