Tuesday, 26 January 2021

NagaBabu: రవితేజ హీరోయిజంపై నాగబాబు కామెంట్స్.. మరోసారి నిరూపించావంటూ మెగా బ్రదర్ పోస్ట్

ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న మాస్ మహారాజ్ రవితేజ.. ఈ ఏడాది ఆరంభంలోనే 'క్రాక్' సినిమాతో బిగ్గెస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకొని వసూళ్ల ప్రవాహం పారిస్తోంది. ఈ నేపథ్యంలో రవితేజ హీరోయిజంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నేడు (జనవరి 26) రవితేజ పుట్టినరోజు. క్రాక్ సినిమాతో మొదటిసారి యాభై కోట్ల క్లబ్‌లో చేరడంతో రవితేజకు ఈ బర్త్ డే మరింత స్పెషల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు బర్త్ డే విషెస్ పోస్ట్ చేసిన మెగా బ్రదర్ నాగబాబు.. మాస్ మహారాజ్ అభిమానులను ఖుషీ చేసే సందేశం షేర్ చేశారు. ''డియర్ మాస్ మహారాజ రవితేజకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. 'క్రాక్' మూవీతో నీ ఎనర్జీ అనేది ఆరని మంట అని మరోసారి రుజువు చేశావు. నిన్ను వెండితెరపై చూసిన ప్రతిసారి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నీ తదుపరి మూవీ 'ఖిలాడీ' కూడా సక్సెస్ కావాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు నాగబాబు. 'క్రాక్' హిట్ జోష్‌లో రవితేజ ప్రస్తుతం రమేశ్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఖిలాడీ' సినిమాలో నటిస్తున్నారు. ఈ రోజే రవితేజ బర్త్ డే కానుకగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pqs1By
v

No comments:

Post a Comment