Friday, 8 January 2021

‘క్రాక్’ KRACK

‘క్రాక్’ సినిమాతో సంక్రాంతి పండుగ సందడి తీసుకుని వచ్చాడు మాస్ రాజా రవితేజ. కోనసీమ కోడిపందేలకు ఎంత ఫేమస్సో.. మాస్ రాజా రవితేజ పోలీస్ డ్రెస్‌ వేస్తే ఫ్యాన్స్‌ని ఆ కిక్కే వేరప్పా. అప్పట్లో రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్ అంటూ మీసం మెలేసిన మాస్ రాజా.. క్రాక్ సినిమాతో శంకర్.. పోతరాజు వీర శంకర్‌గా పోలీస్ అవతారం ఎత్తాడు. లాక్ డౌన్ వల్ల థియేటర్స్‌లో సినిమా చూడలేక నీరసించిపోయిన ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేందుకు శనివారం నాడు థియేటర్స్‌లో అడుగుపెట్టాడు మాస్ రాజా రవితేజ. బలుపు, డాన్ శీను వంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన ఒంగోలు కుర్రాడు గోపీచంద్ మలినేని.. మాస్ రాజాతో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు ఒంగోలు నేపథ్యంలోనే ఈ ‘క్రాక్’ కథను అల్లాడు. శృతి హాసన్ రవితేజతో జోడీ కట్టింది. బలుపు చిత్రంతో హిట్ కాంబోగా మారిన ఈ ఇద్దరూ తిరిగి అదే దర్శకుడితో మరోసారి రిపీట్ చేశారు. తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని విలన్ పాత్ర పోషించారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటించారు. అలీ, మహేష్ కత్తి, వంశీ క్రిష్ణ, జోష్ రవి, ముక్కు అవినాష్, సుధాకర్ తదితర భారీ తారాగణంతో ఈ సినిమాను తెరకెక్కించారు. రవితేజ పోలీస్ క్యారెక్టర్ చేయడం.. ట్రైలర్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు లాక్ డౌన్ తరువాత విడుదలౌతున్న పెద్ద సినిమా ‘క్రాక్’ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ‘క్రాక్’ ఎంత వరకూ రీచ్ అయ్యింది? మాస్ రాజా రవితేజ ఖాతాలో మరో హిట్ పడిందా? అన్నది రివ్యూలో చూద్దాం. Note: భారత కాలమానం ప్రకారం యూఎస్‌లో శుక్రవారం తెల్లవారుజామున పడాల్సిన ‘క్రాక్’ మూవీ షోలు.. తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్సుల్లో ఉదయం 8.30 నుంచి ప్రదర్శితమవ్వాల్సిన షోలు రద్దయ్యాయి. ఫైనాన్సియల్ క్లియరెన్స్ కారణంగా ‘క్రాక్’ సినిమా యూఎస్ ప్రీమియర్లు, ఇండియాలో ఉదయం షోలు రద్దయ్యాయి. అయితే, ప్రస్తుతం ఫైనాన్సియల్ క్లియరెన్స్ అయిపోయిందని.. 9 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో షోలు పడతాయని ‘క్రాక్’ పీఆర్ టీమ్ స్పష్టం చేసింది. పూర్తి రివ్యూ వచ్చేందుకు ఆలస్యం కావచ్చు. బజ్ ఆధారంగా రేటింగ్ ఇవ్వడం జరిగింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bt6gNj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...