Saturday, 23 January 2021

Krack Collections: థియేటర్లలో మాస్ మహారాజ్ వీరంగం.. రవితేజ కెరీర్‌లోనే సరికొత్త రికార్డు!!

మాస్ మహారాజ్ హీరోగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'క్రాక్' మూవీ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా విడుదలకు ముందే 'షూర్‌ షాట్‌.. నో డౌట్‌.. పుచ్చ పేలిపోద్ది' అంటూ మాస్‌ డైలాగ్‌తో ట్రెండ్‌ సృష్టించిన రవితేజ.. సంక్రాంతి పండగ వేళ సత్తా చాటుతున్నారు. 50 శాతం ఆక్యుపెన్సీతోనే రికార్డు లెవల్ వసూళ్లు రాబడుతున్న క్రాక్ మూవీ రవితేజ కెరీర్లోనే ఓ మైల్ స్టోన్ కానుందని తాజా కలెక్షన్ రిపోర్ట్స్ చూస్తుంటే స్పష్టమవుతోంది. కరోనా విజృంభణతో మూతపడిన థియేటర్లకు అసలు జనం వస్తారా? లేదా అనే సందేహాన్ని తొలిరోజే తుడిచిపెట్టిన రవితేజ.. 'క్రాక్'తో కిర్రాక్ కలెక్షన్స్ రాబట్టుతున్నారు. నేటికీ ఈ సినిమాపై ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గకపోగా, క్రాక్ ఇస్తున్న బూస్ట్ దర్శకనిర్మాతల్లో ధైర్యం నింపుతోంది. కలెక్షన్స్ పరంగా ఎక్కడా డీలా పడకుండా దూసుకుపోతున్న క్రాక్ ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొత్తంగా చూస్తే విడుదలైన 13 రోజుల్లో 52 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. 30.83 కోట్ల షేర్ వసూలైంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17.5 కోట్లు మాత్రమే. అంటే ఇప్పటికే 13 కోట్ల ప్రాఫిట్‌లో ఉంది క్రాక్. ఇదిలాఉంటే రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా క్రాక్ నిలవనుండటం విశేషం. గతంలో ఆయన నటించిన 'బలుపు' సినిమా 49 కోట్ల గ్రాస్, ఆ తర్వాత 'రాజా ది గ్రేట్' సినిమా 51.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగా ఇప్పుడు 'క్రాక్' ఆ మార్క్ దాటేయడానికి సిద్ధంగా ఉంది. భారీ కలెక్షన్స్‌తో ప్రస్తుతం ప్రాఫిట్ జోన్‌లో కొనసాగుతున్న క్రాక్ సినిమాకు థియేటర్స్ సంఖ్య కూడా పెరగనుండటం మరింత ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో.. మొత్తానికైతే 'క్రాక్'తో మళ్ళీ ట్రాక్ ఎక్కేశారు రవితేజ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39TXUvH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...