Friday, 1 January 2021

Dirty Hari: బోల్డ్ సినిమాకు భలే గిరాకీ.. కొనసాగుతున్న వసూళ్ల వేట.. ఇక థియేటర్స్‌లో కూడా!

కాలం మారుతుంటే క్రమంగా ఆడియన్స్ టేస్ట్ మారుతోంది. అందుకు అనుగుణంగా దర్శకనిర్మాతలు సైతం తమ తమ సినిమాలను ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసే కంటెంట్‌తో నిర్మిస్తున్నారు. ఇదే బాటలో ఇటీవలే ప్రముఖ నిర్మాత రూపొందించిన '' విడుదలై వసూళ్ల వేట కొనసాగిస్తోంది. ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమాకు డిఫరెంట్ ప్రమోషన్స్ చేసి సక్సెస్ అయ్యారు ఎంఎస్ రాజు. దీంతో విడుదలైన తొలిరోజే ఈ మూవీ భారీ రెస్పాన్స్ తెచ్చుకొని అదే కంటిన్యూ చేస్తూ నిర్మాతను సేఫ్ జోన్‌లోకి తీసుకొచ్చింది. ఒకానొక సమయంలో నిర్మాతగా భారీ హిట్స్ అందుకున్న ఎంఎస్ రాజు ఈ 'డర్టీ హరి'కి దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల సినీ ఇండస్ట్రీలో దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తీసుకున్న ఆయన ఈ సినిమాతో అనుకున్న టార్గెట్ రీచ్ కావడమే గాక తిరిగి ట్రాక్ ఎక్కేశారు. 'మందు తాగుతూ ఈ సినిమా చూడొచ్చు' అనే బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇస్తూ ఆయన చేసిన ప్రమోషన్స్ 'డర్టీ హరి'కి బాగా ప్లస్ అయ్యాయి. ఫ్రైడే మూవీస్ అనే యాప్ ద్వారా విడుదలైన ఈ సినిమా నేటికీ జనాలను అట్రాక్ట్ చేసింది. ఈ యాప్‌లో ఒక వ్యూకి 120 రూపాయాలని టికెట్ రేటు పెట్టగా.. తక్కువ సమయంలోనే కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టిందట డర్టీ హరి. అలాగే ఈ సినిమా కోసం 'ఆహా' యాప్ మంచి డీల్ కుదుర్చుకొని ప్రసారం చేయడం మరింత కలిసొచ్చింది. ఇక ఇప్పుడు డైరెక్ట్‌గా థియేటర్స్‌లో ఈ డర్టీ హరిని విడుదల చేయనుండటం విశేషం. జనవరి 8న ఈ మూవీ థియేటర్స్‌లో విడుదల కానుందని అఫీషియల్‌గా ప్రకటించింది చిత్రయూనిట్. సో.. చూడాలి మరి థియేటర్ కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X4yvJu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...