Saturday, 9 January 2021

Cobra Teaser: డిఫరెంట్ షేడ్స్‌లో చియాన్ విక్రమ్.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్

కెమెరా ముందు ఎలాంటి క్యారెక్టర్‌లో అయినా ఒదిగిపోగల టాలెంటెడ్ యాక్టర్ చియాన్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'కోబ్రా'. డిఫరెంట్ టైటిల్, వైవిద్యభరితమైన కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 90 శాతం మేర కంప్లీట్ కావడంతో ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టింది చిత్రయూనిట్. ఈ మేరకు తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం 47 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోతోంది. ప్రతి ఫ్రేమ్ కూడా సినిమాపై ఆతృతను పెంచేస్తూ అంచనాలు రెట్టింపు చేసింది. ఇందులో డిఫరెంట్ షేడ్స్‌లో విక్రమ్ కనిపించగా భారత క్రికెటర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సినిమాతోనే ఇర్ఫాన్ పఠాన్ వెండితెర ఆరంగేట్రం ఇవ్వనుండటం విశేషం. టీజర్ మొదటి షాట్ నుంచి చివరి వరకూ ఇర్ఫాన్ పఠాన్‌ని బాగా హైలైట్ చేశారు. ఇందులో విక్రమ్ శాస్త్రవేత్తగా, ప్రొఫెసర్‌గా‌, రాజకీయనాయకుడిగా, మత భోదకుడిగా పలు గెటప్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రతి సమస్యకూ గణిత పరిష్కారం ఉంటుందని చెబుతూ విక్ర‌మ్ కోబ్రా మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని టీజర్ ద్వారా అర్థమవుతోంది. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ మూవీలో విక్రమ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. కేఎస్‌ రవికుమార్‌, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bodYIb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...