Friday, 15 January 2021

‘రాధే శ్యామ్’ యూనిట్‌ను సర్‌ప్రైజ్ చేసిన ప్రభాస్.. రెబల్ స్టార్ సంక్రాంతి స్పెషల్ గిఫ్ట్స్!

యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం ‘’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరిదశ షూటింగ్‌కి చేరుకుంది. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా తాజాగా ఈ మూవీ యూనిట్ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ హీరో ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారు. యూనిట్ మొత్తానికి ప్రభాస్ రిస్ట్ వాచ్‌లు గిఫ్టులుగా ఇచ్చాడట. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన సినిమాలో పని చేస్తున్న టెక్నీషియన్లందరికీ ఖరీదైన వాచ్‌లను పంపించాడని సమాచారం. దీంతో ప్రభాస్‌ మనసు నిజంగా చాలా పెద్దది అని ఆయనిచ్చిన గిఫ్ట్‌ చూసి యూనిట్‌ సభ్యులు మురిసిపోతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ న్యూస్ తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘రాధే శ్యామ్’ మూవీలో ప్రభాస్ దొంగగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. 1960 దశకం నాటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు పునర్జన్మల నేపథ్యంలో ఈ మూవీ కథ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని టాక్. ఈ సినిమా ఏడాది వేసవిలో భారీ ఎత్తున ఈ మూవీ విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ టీజర్ త్వరలోనే వస్తుందని చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oQhkaX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...