Friday, 29 January 2021

మహేష్ చేతిలో తాళాల గుత్తి.. 'సర్కారు వారి పాట' విడుదలపై సర్‌ప్రైజింగ్ అప్‌డేట్

గతేడాది 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకుంటూ సంక్రాంతి సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ .. వచ్చే ఏడాది అదే సంక్రాంతిని టార్గెట్ చేశారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ '' రిలీజ్ కోసం సంక్రాంతి సీజన్‌ను ఎంచుకున్నారు. నిజానికి ఈ సినిమా ప్రకటన వచ్చి నెలలు గడిచిపోతున్నా చివరకు ఇటీవలే షూటింగ్ ప్రారంభించారు మేకర్స్. ఈ క్రమంలోనే రిలీజ్‌పై ఓ అంచనాకు వచ్చి 2022 సంక్రాంతి రేస్‌లో నిలవబోతున్నట్లు తెలిపారు. ఇటీవలే షూటింగ్స్ రీ- ఓపెన్ కావడం, ఆపై సినిమా థియేటర్ల గేట్లు తెరుచుకోవడంతో స్టార్ హీరోలంతా ఒక్కొక్కరుగా తమ తమ సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ అభిమానులకు కూడా సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చారు 'సర్కారు వారి పాట' దర్శకనిర్మాతలు. సినిమా విడుదల తేదీ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ద్వారా ఇచ్చిన ఈ అప్‌డేట్‌ను మహేష్ బాబు తన అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు షేర్ చేసిన కొత్త పోస్టర్‌లో మహేష్ తాళాల గుత్తి చేతిలో పట్టుకొని కనిపిస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్స్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. జనవరి 25 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. దుబాయ్‌లో మొదలైన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో మహేష్ బాబుతో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ భాగమవుతోంది. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3r1OvZY
v

No comments:

Post a Comment