Tuesday, 19 January 2021

కమల్ హాసన్‌కు శస్త్ర చికిత్స.. తండ్రి ఆరోగ్య పరిస్థితిపై అక్షర, శృతి హాసన్‌ రియాక్షన్

కొద్ది రోజులుగా బిగ్ బాస్ షోతో పాటు సినిమాలు, రాజ‌కీయాల‌తో బిజీ బిజీగా ఉన్న సీనియర్ యాక్టర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాలికి శస్త్ర చికిత్స జరిగింది. ఇటీవల తన లేటెస్ట్ మూవీ శభాష్ నాయుడు షూటింగ్ స‌మ‌యంలో ఆయన యాక్సిడెంట్‌కు గురయ్యారు. కొద్దిరోజుల పాటు సినిమా షూటింగ్ సహా అన్ని పనులు పక్కనబెట్టి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ చెప్పినా అవేవీ పట్టించుకోకుండా పనుల్లో మునిగిపోవడంతో నొప్పి తిరగబడింది. దీంతో ఆయన స్వల్ప శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని కమల్ కుమార్తెలు శృతిహాసన్‌, అక్షర హాసన్ ట్విట్టర్‌ వేదికగా తెలుపుతూ ట్వీట్ చేశారు. ''కమల్‌ హాసన్‌ కాలికి శస్త్ర చికిత్స జరిగింది. మీ అంద‌రి ప్రేమ‌, అభిమానం, ఆశీర్వాదం వల్ల ఈ శస్త్ర చికిత్స విజయవంతమైంది. మరో నాలుగైదు రోజులు కమల్ హాస్పిటల్‌లోనే ఉంటారు. నాన్న‌గారి ఆరోగ్యం విష‌యంలో శ్రీ రామ చంద్ర ఆసుప‌త్రి చాలా కేర్ తీసుకున్నార‌ు. అక్కడి వైద్యులకు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాం'' అని పేర్కొన్నారు. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని, తర్వాత ఆయన మళ్లీ ప్రజలను ఎప్పటిలాగే కలుసుకుంటారని శృతి, అక్షర తెలిపారు. ‌ మక్కల్‌ నీది మయ్యం పార్టీని స్థాపించిన కమల్‌ హాసన్.. ఏప్రిల్ నాటికి తమిళనాడులో రాజకీయ వేడి మొదలు కానున్న నేపథ్యంలో ఆ సమయానికల్లా పూర్తి ఆరోగ్యంతో ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఆయన 'భారతీయుడు 2' సినిమాతో పాటు చేస్తూనే ఇటీవలే లోకేష్ కనకగరాజ్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిటయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38V9SG4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...