Friday, 22 January 2021

జోరుమీదున్న పవర్ స్టార్.. మరో క్రేజీ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!

'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకొని రాజకీయ కార్యకలాపాలతో బిజీ అయిన పవర్ స్టార్ తిరిగి ఇటీవలే కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అటు తన పార్టీ పనులు చూసుకుంటూనే ఇటు సినిమా షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్న ఆయన వరుస సినిమాలు ఓకే చేస్తుండటం మెగా అభిమానులను హుషారెత్తిస్తోంది. ఇప్పటికే 'వకీల్ సాబ్' షూటింగ్ ఫినిష్ చేసిన పవన్.. తన లిస్టులో మరో క్రేజీ డైరెక్టర్ రమేష్ వర్మను కూడా చేర్చేశారని సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం రవితేజ హీరోగా 'ఖిలాడీ' మూవీ రూపొందిస్తున్న రమేష్ వర్మ.. ఇటీవలే పవన్‌కి ఓ స్టోరీ లైన్ వినిపించి ఓకే అనిపించుకున్నారట. ఈ లైన్ పవన్‌కి నచ్చడంతో కథను డెవలప్ చేయాల్సిందిగా సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తానెలాగూ 'ఖిలాడీ' సినిమా చేస్తున్నా కాబట్టి ఆ సినిమా ఫినిష్ అయ్యేలోగా పవన్‌ని మెప్పించే కథ రెడీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. మరోవైపు పవన్ కళ్యాణ్ తన లేటెస్ట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ కోసం రెడీ అవుతున్నారు. ఇటీవలే ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో పవన్‌తో పాటు దగ్గుబాటి రానా కూడా నటిస్తుండటం విశేషం. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఇకపోతే వీటితో పాటు క్రిష్, హరీష్ శంకర్ సినిమాలను లైన్‌లో పెట్టారు పవన్. సో.. పరిస్థితి చూస్తుంటే ఈ సినిమాలన్నీ పూర్తయ్యేకే రమేష్ వర్మతో పవన్ సినిమా ఉండబోతుందని అర్థమవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39epYuJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...