Monday, 18 January 2021

పిచ్చి మరో లెవల్‌కి వెళ్లింది.. అభిమాని చేసిన పనిపై ఛార్మి క్రేజీ రియాక్షన్! వీడియో వైరల్

ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే తమ అభిమాన హీరో సినిమా వస్తోందంటే చాలు అదో పండగలా ట్రీట్ చేయడం, సినిమా విడుదలైన ఆ రోజును ఫుల్లుగా ఎంజాయ్ చేయడం చూస్తుంటాం. ఇక అభిమాన తారల పుట్టినరోజులకు కేక్స్ కట్ చేయడం లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ అభిమానం చాటుకోవడం ఇంకొందరి స్టైల్. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ రౌడీ స్టార్ ఫ్యాన్స్ చేసిన ఓ వెరైటీ పనిచూసి ఆశ్చర్యపోయింది నిర్మాత . నేటి ఉదయం విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా టైటిల్‌ను రివీల్ చేయడంతో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ కూడా రిలీజ్ చేశారు. పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి '' అనే డిఫరెంట్ టైటిల్, ‘సాలా క్రాస్‌బ్రీడ్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ హుషారెత్తిపోతూ విజయ్ దేవరకొండపై అభిమానం చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని తన చేతి మణికట్టుపై 'లైగర్' అనే పేరును పచ్చబొట్టుగా కొట్టించుకున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఛార్మి క్రేజీగా రియాక్ట్ అయింది.''పిచ్చి మరో లెవల్‌కి వెళ్లింది. పర్మనెంట్ టాటూ వేయించుకున్నాడు. లైగర్ సినిమాపై మీరు పెట్టుకున్న నమ్మకానికి గర్విస్తున్నా. మీపై నేను చూపించే ప్రేమ కొలవలేనిది'' అని పేర్కొంది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ లైగర్ సినిమా నిర్మాణంలో ఛార్మి భాగమవుతోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో రియాలిటీకి దగ్గరగా ఉండేలా విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3imy8UH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...