Thursday, 7 January 2021

డైరెక్టర్ మారుతి కారణంగా అల్లు అరవింద్‌కి కోర్టు ఉత్తర్వులు! గోపీచంద్ రియాక్షన్ చూస్తే..

టాలీవుడ్‌లో వినోదాత్మక చిత్రాలు రూపొందించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు . 'భలే భలే మగాడోవోయ్' సినిమాతో ఆయనిచ్చిన కామెడీ టచ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అదే బాటలో 'ప్రతిరోజూ పండగే' సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఆయన.. ఈ మూవీ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చారు. దీంతో మారుతి తదుపరి ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున రూమర్స్ షికారు చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేస్తూ అఫీషియల్ సమాచారం ఇచ్చారు మారుతి. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ విడుదల చేస్తామని తెలుపుతూ తన ట్విటర్లో ఒక వీడియో షేర్‌ చేశారు. ఈ వీడియోలో విజయవాడ, హైదరాబాద్‌ ప్రాంతాల ల్యాండ్‌స్కేప్‌ చూపిస్తూ తనపై న్యూస్‌ఛానెళ్లు బ్రేకింగ్‌ న్యూస్‌ ఇస్తున్నట్లు చూపుతూ ఆసక్తి రేకెత్తించారు. కోర్టులో న్యాయమూర్తిగా రావురమేష్ తీర్పునిస్తూ ‘‘సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట ముద్దాయి డైరెక్టర్‌ మారుతి ప్రతిరోజూ పండగ సినిమా తర్వాత తీయబోయేది ఈ కథే అని తెలుపుతూ ప్రేక్షకులకు క్లారిటీ ఇవ్వాలని ఆ చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, యూవీ క్రియేషన్స్ వారికి ఉత్తర్వులు జారీ చేయడమైనది’’ చెప్పడం ఈ వీడియోలో హైలైట్ అవుతోంది. ఈ సినిమాలో గోపిచంద్‌ హీరోగా నటించనున్నారని తెలిపారు మారుతి. , బన్నీవాసు, యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలుగా వ్యవహరించనున్నారని, వారితో పని చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇక ఇదే వీడియోను తన ట్విట్టర్ కహతాలో పోస్ట్ చేసిన హీరో .. డైరెక్టర్ మారుతితో పని చేయాలని ఆసక్తిగా ఉందని తెలుపుతూ అతిత్వరలో ఫస్ట్‌లుక్ రిలీజ్ కానుందని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3niefid
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...