Tuesday, 5 January 2021

‘బిగ్ బాస్’ అఖిల్‌కి బంపరాఫర్.. గోపీచంద్ సినిమాలో ఛాన్స్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఫైనలిస్ట్ సార్థక్‌కు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే, తన సినిమా అవకాశాల గురించి అఖిల్ అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఇప్పుడు అఖిల్ సినిమా అవకాశానికి సంబంధించి మరో రూమర్ వినిపిస్తోంది. మాచో స్టార్ హీరోగా రూపొందుతోన్న ‘సీటీమార్’లో అఖిల్‌కు అవకాశం దక్కినట్టు ఇండస్ట్రీ టాక్. గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. అయితే, ఈ సినిమాలో అఖిల్‌కు చిన్న పాత్ర దక్కిందని అంటున్నారు. సెకండాఫ్‌లో అఖిల్ కనిపిస్తాడని వదంతులు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలో నిజమెంతో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. నిజానికి అఖిల్ తన సినిమా కెరీర్‌ను 2016లో మొదలుపెట్టారు. ‘బావ మరదలు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచమయ్యారు. అయితే, ఇది చాలా చిన్న సినిమా. ఇది అఖిల్‌కు ఎలాంటి గుర్తింపు తీసుకురాలేదు. దీంతో అఖిల్ టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ‘ముత్యాల ముగ్గు’ అఖిల్‌కు తొలి సీరియల్. ‘కళ్యాణి’ సీరియల్‌తో అఖిల్‌కు గుర్తింపు వచ్చింది. ‘ఎవరే నువ్వు మోహిని’ సీరియల్‌లో అఖిల్ చేసిన నెగిటివ్ రోల్ ప్రేక్షకులకు చేరువైంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nm9fsW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...