Friday, 22 January 2021

మునుపటిలా బాడీ బిల్డ్ చేసుకున్నా.. ఫిట్‌నెస్ రహస్యం బయటపెడుతూ తమన్నా వీడియో

కొందరు హీరోయిన్స్ అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటే ఇంకొందరు హీరోయిన్స్ మాత్రం ఏళ్ల తరబడి వెండితెరపై అలరిస్తూనే ఉంటారు. పైగా ఎన్నేళ్లు గడిచినా వారి అందం, ఫిట్‌నెస్‌లో మాత్రం ఎంతమాత్రం కూడా మార్పు కనిపించదు. నిజానికి ఇప్పుడున్న వాళ్లలో ఇలాంటి హీరోయిన్స్ కొందరే ఉన్నా అందులో ఒకరే మిల్కీ బ్యూటీ . తన నాజూకైన శరీర సౌష్టవంతో గత పదేళ్ల కాలంగా తెలుగు ప్రేక్షకులను మైమరిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలో తాజాగా ఫిట్‌నెస్ సీక్రెట్ తెలుపుతూ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది తమన్నా. ఇటీవలే కోవిడ్‌కు గురై కోలుకున్న తమన్నా.. ప్రస్తుతం తన బాడీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. కోవిడ్ నుంచి కోలుకున్నాక వ్యాయామంపై దృష్టి సారించి జిమ్‌లో కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు మునుపటిలా బాడీ బిల్డ్ చేసుకున్నా అని తెలుపుతూ వీడియో పోస్ట్ చేసింది. లైట్ వెయిట్ వర్కవుట్స్ తనకు బాగా ఉపయోగపడ్డాయని, జిమ్‌లో మరీ ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదని, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే సరిపోతుందని తమన్నా పేర్కొంది. రెండు నెలలు వ్యాయామం చేసి తిరిగి కోవిడ్‌కి ముందు శరీర సౌష్టవం పొందానని ఆమె తెలిపింది. 2005 సంవత్సరంలో 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే హిందీ సినిమాలో నటించి అదే ఏడాది 'శ్రీ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నా.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'హ్యాపీ డేస్' మూవీతో పాపులారిటీ సంపాదించింది. ఇటీవలే మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె F2 సీక్వల్ F3లో నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KDtxB3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...