Monday, 4 January 2021

మహేష్‌కి వదిన కాబోతున్న రేణు దేశాయ్..? టాలీవుడ్‌లో హాట్ టాపిక్

గతేడాది 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టేసిన సూపర్ స్టార్ ఈ ఏడాది '' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీలో మహేష్ సిస్టర్ రోల్‌లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య పోషించనుందని విన్నాం. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఆమె మహేష్ సిస్టర్‌గా కాదు వదినగా నటిస్తోందని తెలుస్తోంది. ఈ రోల్ సినిమాలో చాలా కీలకం అంటున్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన స్ట్రాంగ్ కథాంశంతో ఈ మూవీ స్క్రిప్ట్ రెడీ చేశారట డైరెక్టర్ పరశురామ్. మహేష్ వ్యాపారవేత్తగా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతూ సోషల్ మెసేజ్ ఇవ్వనుందని టాక్. అలాగే కామెడీకి పెద్ద పీట వేస్తూ హీరోయిన్ రోల్ కూడా గ్లామరస్‌గా తీర్చిదిద్దారట డైరెక్టర్. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ కూడా కీలకపాత్రలో నటించనుందనే లేటెస్ట్ అప్‌డేట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇక ఈ 'సర్కారు వారి పాట' మూవీలో మహేష్ బాబు హీరోగా నటించడమే గాక చిత్ర నిర్మాణంలోనూ భాగస్వామ్యం పంచుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా ఈ మూవీ విడుదల కానుంది. ఎస్.ఎస్. థమన్ బాణీలు కడుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆసక్తి రేకెత్తించాయి. దీంతో ఈ మూవీపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3odlUjk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...