Monday, 11 January 2021

మీరెక్కువగా లైవ్‌లో చూడటానికి ఇష్టపడతారా.. యాంకర్‌‌‌తో సునీల్ పరాచకాలు

హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్.. ఇలా అన్ని రకాల పాత్రలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సునీల్. హాస్యనటుడు నుంచి హీరోగా మారిన ఈ భీమవరం బుల్లోడు ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. హీరోగా రాణించలేకపోయారు. దీంతో మళ్లీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి సినిమాలు చేస్తున్నారు. కిందటేడాది ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో చిన్న పాత్ర చేశారు. అదే ఏడాది ‘కలర్ ఫోటో’లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ‘అల.. వైకుంఠపురములో’ సినిమా విడుదలై ఏదాడి పూర్తయిన సందర్భంగా ఆ చిత్ర బృందం రీయూనియన్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని గీతా ఆర్ట్స్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత అల్లు అరవింద్, నటులు సముద్రఖని, సునీల్, నవదీప్, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడేందుకు నవదీప్, సునీల్‌ను యాంకర్ వేదికపైకి పిలిచారు. వేదికపైకి వచ్చిన సునీల్ చాలా సున్నితంగా, డబుల్ మీనింగ్ డైలాగులతో యాంకర్‌పై పంచులేశారు. సునీల్ - యాంకర్ మధ్య సంభాషణ ఇలా సాగింది.. సునీల్: ఏమైనా అడగండి.. యాంకర్: ఏదడిగినా చేస్తారా? సునీల్: అంటే.. (ఆలోచన) యాంకర్: అందుకే అడగమని చెప్పకూడదు నాకు. సునీల్: ఇన్నాక చెప్తాం. యాంకర్: అంటే.. వన్ ఇయర్ అయ్యిందా కదా చూసి.. కొంచెం అందుకే.. సునీల్: మీరు చూడలేదా ‘కలర్ ఫోటో’ యాంకర్: వన్ ఇయర్ గ్యాప్ తరవాత లైవ్‌లో చూడటం ఇదే కదా సునీల్: అందరూ వన్ ఇయర్ తరవాత లైవ్‌లోకి రావడం ఇదే అనుకుంటా. మీరెక్కువ లైవ్‌లో చూడటానికి ఇష్టపడతారా? యాంకర్: సునీల్ గారు.. నేను మైక్ ఆఫ్ చేసిన తరవాత మాట్లాడతా మీతో సునీల్: జనరల్‌గా నేను చాలా కామ్‌గా ఉంటానండి.. కెలికితే మిగిలిన వాళ్లంతా కామ్ అయిపోతారు. యాంకర్: అందుకే.. మైక్ ఆఫ్ చేసిన తరవాత మాట్లాడతా సునీల్: కొంచెం నవదీప్ గారి మీద కన్నేయండి.. యాంకర్: ఇంక చాలు.. నాకు కడుపు నిండిపోయింది. సునీల్: నాతో పోల్చుకుంటే ఆయన చాలా యంగ్. యాంకర్: రెండు మీల్స్ వద్దు.. ఒక మీల్ చాలు సునీల్: భయ్యా.. కొంచెం నీ టాలెంట్ చూపిస్తే.. జస్ట్ టీజర్ వెయ్.. ఇలా యాంకర్‌ను సునీల్ ఆటపట్టించారు. ఆ తరవాత సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా తనకు రీ లైఫ్ ఇచ్చిందని సునీల్ అన్నారు. ఈ సినిమా వల్ల ఇప్పుడు చాలా ప్రాజెక్టులు చేస్తున్నానని సునీల్ వెల్లడించారు. ఈ ఏడాది మధ్యస్తంలో తన ప్రాజెక్టుల గురించి అందరికీ తెలుస్తుందని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39q1mOn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...