Monday, 4 January 2021

స్పీడు పెంచిన హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ మూవీ హీరోయిన్ ఫిక్స్! బాలీవుడ్ బ్యూటీకి బంపర్ ఆఫర్

రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన వరుస సినిమాలకు కమిటయ్యారు. ఇప్పటికే తన వకీల్ సాబ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన.. అతి త్వరలో రానాతో కలిసి 'అయ్యప్పన్ కోషియమ్' రీమేక్ షూటింగ్‌లో జాయిన్ కానున్నారట. ఇక ఈ సినిమాతో పాటు క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతో సినిమాలను లైన్‌లో పెట్టారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కోసం పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకొని వెయిట్‌ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పనుల స్పీడు పెంచేశారు. ఇటీవలే న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ని కలిసిన హరీష్ శంకర్.. తమ కాంబోలో రాబోతున్న సినిమాపై కొన్ని కీలక విషయాలను చర్చించారట. ఈ క్రమంలోనే హీరోయిన్ గురించిన చర్చ రాగా.. అయితే బాగుంటుందని అటు పవన్ ఇటు హరీష్ ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారట. దీంతో హీరోయిన్‌ కియారా డేట్స్ కోసం హరీష్ ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని ఫిలిం నగర్ టాక్. మరోవైపు సౌత్‌లో సినిమాలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నా కానీ బాలీవుడ్ సినిమాల కారణంగా డేట్స్ అందుబాటులో లేవనే కారణం చూపుతూ ఇటీవల సౌత్‌ దర్శకనిర్మాతల నుంచి వచ్చిన ఆఫర్స్ కాదనుకున్న కియారా.. పవన్‌, హరీష్‌ కాంబోలో తెరకెక్కబోయే టైమ్‌కి కమిట్‌మెంట్స్‌ అన్నీ కంప్లీట్‌ చేసి ఈ మూవీలో నటించాలని అనుకుంటోందట. గతంలో మహేష్ బాబు, రామ్ చరణ్‌లతో రొమాన్స్ చేసిన కియారకు ఇప్పుడు పవన్ సరసన నటించే అవకాశం రావడం తన టాలీవుడ్ కెరీర్‌కి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. మైత్రీమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో‌ తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. గతంలో పవన్ ‌కళ్యాణ్- హరీశ్‌ శంకర్‌ కాంబో‌లో రూపొందిన 'గబ్బర్‌సింగ్‌' ఇండస్ట్రీ హిట్‌ సాధించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. పైగా పవన్ కళ్యాణ్‌కి డైరెక్టర్ హరీష్ శంకర్ వీరాభిమాని కాబట్టి ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ సినిమానే హైలైట్ అవుతుందని ఆశిస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/359N3fj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...