Sunday, 3 January 2021

సుధీర్ బాబు, ఇంద్రగంటి కాంబోలో మరో సినిమా.. ముహూర్తం ఖరారు

వైవిధ్యమైన చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆహ్లాదకరమైన హాస్యం, మనసుకు హత్తుకునే భావోద్వేగాలు ఇంద్రగంటి సినిమాలో కనిపిస్తాయి. తక్కువ బడ్జెట్‌లో మంచి సినిమాలు నిర్మించడంలో మోహనకృష్ణ దిట్ట. ‘అష్టా-చమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘జెంటిల్‌మేన్’, ‘అమీ తుమీ’ సినిమాలే దీనికి ఉదాహరణలు. అయితే, రెండేళ్ల క్రితం అంటే 2018లో సుధీర్ బాబు, అదితీరావు హైదరి హీరోహీరోయిన్లుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సమ్మోహనం’ సినిమా ప్రేక్షకుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తరవాత ‘V’ చిత్రంలో సుధీర్ బాబుకు అవకాశం ఇచ్చారు. నేచురల్ స్టార్ నాని, హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు సుధీర్ బాబు. ఇది సుధీర్ బాబుకు 14వ సినిమా. కృతిశెట్టి హీరోయిన్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా రేపు ప్రారంభంకానుంది. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బెంచ్‌మార్క్ స్టూడియోస్ బ్యానర్‌పై బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెంచ్‌మార్క్ స్టూడియోస్ నిర్మిస్తోన్న తొలి చిత్రమిది. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు. పి.జి.విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విశేషాలు రేపు తెలియనున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38Weiv5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...