Monday, 18 January 2021

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటే కార్యక్రమంలో భాగమైన సీనియర్ హీరోయిన్ మీనా

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన నేటికీ కొనసాగుతోంది. ఇప్పటికే ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగమై మొక్కలు నాటారు. మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం ప్రసాదించిన వచ్చని, ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగమై మొక్కలు నాటాల్సిందిగా పలువురు ప్రముఖులు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ హీరోయిన్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తి చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాంకర్, బిగ్ బాస్ షో 4 ఫేం దేవి నాగవల్లి ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి నేడు (సోమవారం) చెన్నై సైదాపెట్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు హీరోయిన్ మీనా. ఈ సందర్భంగా మొక్కలు నాటడం వల్ల ప్రయోజనాలపై స్పందిస్తూ.. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు అని అన్నారు. మారుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి మనమంతా బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె కోరారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని పేర్కొంటూ ప్రముఖ టాలీవుడ్ హీరో వెంకటేష్, ప్రముఖ కన్నడ హీరో సుదీప్, మళయాళం హీరోయిన్ మంజు వారియర్, హీరోయిన్ కీర్తి సురేష్‌లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oQIsGO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...