Tuesday, 19 January 2021

బంగారు బుల్లోడు ట్రైలర్: బాలయ్య టైటిల్.. అల్లరి నరేష్ కామెడీ టచ్!! అదిరిందయ్యా బాబూ..

నందమూరి బాలకృష్ణ క్రేజీ టైటిల్ ''తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు హీరో అల్లరి నరేష్. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో జంటగా పూజా జవేరి నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. ఒక నిమిషం 50 సెకనుల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ప్రతి సన్నివేశంలో నవ్విస్తోంది. ఎప్పటిలాగే అల్లరి నరేష్ మరోసారి తనదైన కామెడీ టచ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతుందో ఓ క్లారిటీ వచ్చేస్తోంది. బంగారు ఆభరణాలు కుదువ పెట్టుకుని రుణాలు ఇచ్చే బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటిస్తున్న అల్లరి నరేష్.. పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారని తెలుస్తోంది. అనుకోకుండా కొన్ని లక్షల విలువ చేసే బంగారం దొంగిలించబడటంతో ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే ఆసక్తి రేకెత్తిస్తూ ట్రైలర్ కట్ చేశారు. ఈ మూవీలో నరేష్‏తోపాటు పృథ్వీరాజ్, ప్రవీణ్, వెన్నెల కిషోర్‏లు కూడా తమ పాత్రలతో కామెడీ పండించారని తెలుస్తోంది. బాలయ్య బ్లాక్‌బస్టర్ టైటిల్‌ ‘బంగారు బుల్లోడు’ టైటిల్ మాత్రమే గాక అందులోని సూపర్ హిట్ సాంగ్ ‘స్వాతిలో ముత్యమంత’ కూడా ఇందులో రీమిక్స్ చేయడం విశేషం. ఇకపోతే ఈ సినిమాను జనవరి 23న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NamqRk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...