Saturday, 2 January 2021

ప్రముఖ నిర్మాత కె బాలు కన్నుమూత

కోలీవుడ్ ప్రముఖ నిర్మాత కె.బాలు మృతి చెందారు. గత నెలలో అనారోగ్యంతో చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ రోజు (శనివారం) ఉదయం 11 గంటల 30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. బాలు కున్నుమూసిన విషయాన్ని సినీ నటుడు, రాజకీయ నాయకుడు ఆర్ శరత్‌కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆయన మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్న శరత్‌కుమార్ బాలు లేని లోటు తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో బాలుకి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో హాస్పిటల్‌లో చేర్చారు. కొద్దిరోజులుగా ఆయనకు కరోనా చికిత్స అందిస్తుండగా.. ఆరోగ్యం మరింత విషమించడంతో నేడు కన్నుమూశారు. ఇవాళ చెన్నైలోని తన నివాసంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కేపీ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయన పలు సినిమాలు నిర్మించారు. ప్రభు, కుష్బూ హీరోహీరోయిన్లుగా ‘చిన్నతంబి’ సినిమాను తెరకెక్కించారు. గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తిని కోల్పోయామని దర్శక నిర్మాత వెంకట్ ప్రభు పేర్కొన్నారు. బాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాలు మృతి విషయం తెలిసి షాక్‌కు గురైనట్టు జాతీయ అవార్డు పొందిన నిర్మాత జి ధనంజయన్ తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/384yLys
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...