Monday, 18 January 2021

పూరి జగన్నాథ్- నాగార్జున క్రేజీ ప్రాజెక్టుకు లైన్ క్లియర్! ఇస్మార్ట్ దర్శకుడి పక్కా ప్లాన్

సీనియర్ హీరో, టాలీవుడ్ కింగ్ అక్కినేని నటి నుంచి నేటివరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు సరికొత్తగా మేకోవర్ అవుతూ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'వైల్డ్ డాగ్' షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. మరోవైపు నాగ్ డ్రీమ్ ప్రాజెక్టు 'బంగార్రాజు' సెట్స్ మీదకు రావడానికి రెడీ అయింది. ఈ క్రమంలో నాగార్జున నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయమై ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. నాగార్జున తదుపరి సినిమా దర్శకత్వంలో కన్ఫర్మ్ అయిందనే టాక్ వినిపిస్తోంది. గతంలో నాగార్జున- పూరి కాంబోలో ''సూపర్. శివమణి'' సినిమాలు వచ్చి బాక్సాఫీస్ హిట్ సినిమాలుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కిన పూరి.. నాగార్జున కోసం ఓ కథ రెడీ చేశారని ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే లేటెస్ట్‌గా అందుతున్న సమాచారం మేరకు ఇది ఫాంటసీ కథ అని, ఇప్పటికే ఈ సినిమా విషయమై నాగార్జునతో సంప్రదింపులు కూడా ఫినిష్ అయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమాను పూరీనే తన సొంత బ్యానర్‌పై స్వయంగా నిర్మించనున్నారని టాక్. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నారు పూరిజగన్నాథ్. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు 'లైగర్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసిన పూరి.. ఈ ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 'లైగర్' మూవీ కంప్లీట్ కాగానే నాగార్జునతో పూరి సినిమా పట్టాలపైకి వస్తుందని ఫిలిం నగర్‌లో టాక్ నడుస్తోంది. సో.. చూడాలి మరి ఈ సక్సెస్‌ఫుల్ కాంబో మరోసారి రిపీట్ అవుతుందా.. లేదా? అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bNPhoP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...