Saturday, 23 January 2021

ఆయనతో వీలైనంతమంది పిల్లల్ని కనాలని ఉంది.. అదే నా డ్రీమ్! ప్రియాంక చోప్రా ఓపెన్ కామెంట్స్

బాబోయ్.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు భలే కోరిక ఉందే!. సాధారణంగా సెలబ్రిటీలు పిల్లల్ని కనే విషయంలో చాలా రూల్స్ పెట్టుకోవడం చూస్తుంటాం. కానీ.. ప్రియాంక మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదని, ఎక్కువమంది పిల్లల్ని కనడమే తన టార్గెట్‌గా పెట్టుకుందని తాజాగా ఆమె చేసిన కామెంట్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇంతకీ ప్రియాంక ఏం కామెంట్స్ చేసింది? ఈ పిల్లల మ్యాటర్ ఏంటి? అంటారా.. ఇటీవల తన లేటెస్ట్ మూవీ 'ది వైట్ టైగర్' ప్రమోషన్స్‌లో భాగంగా పిల్లల్ని కనే విషయమై ఓపెన్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది . తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ని ప్రేమించి పెళ్లాడిన ప్రియాంక.. పెళ్లి తర్వాత కూడా తన సినీ కెరీర్ కొనసాగిస్తూనే ఉంది. వీలు చిక్కినప్పుడల్లా భర్త నిక్‌తో వెకేషన్ ట్రిప్స్ వేసి అక్కడి రొమాంటిక్ ఫొటోలు పోస్ట్ చేస్తూ కిక్కిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో అమ్మడి దృష్టి పిల్లల్ని కనడంపై పడిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిక్‌తో వీలైనంతమంది పిల్లల్ని కనాలని ఉందంటూ ఓపెన్ అయిన ప్రియాంక.. తాజాగా తన వైట్ టైగర్ మూవీ ప్రమోషన్స్‌లో కూడా అదే రిపీట్ చేసింది. తన జీవితంలో మొదటి ప్రాధాన్యత కుటుంబానికే ఇస్తానని చెప్పిన ఆమె.. నిక్‌తో పిల్లలను కనడం తన కల అని తెలిపింది. దేవుడు ఎప్పుడిస్తే అప్పుడు స్వీకరించడానికి రెడీగా ఉన్నానని పేర్కొంది. ఇకపోతే గతేడాది లాక్‌డౌన్ కారణంగా నిక్‌తో కొన్ని నెలలపాటు హాయిగా గడిపే సమయం దొరికిందని, ఆ స‌మ‌యంలో ఒకరినొక‌రం మ‌రింతగా ఇష్ట‌ప‌డ్డామ‌ని ప్రియాంక చెప్పుకొచ్చింది. 2018లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఇటీవలే లండన్‌లో తమ రెండో వివాహ వార్షికోత్సవం చేసుకున్నారు. మరోవైపు బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది ప్రియాంక చోప్రా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sZg2Nx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...